సూరీడు రాక ముందే లేచి
నాగలి,గడ్డపార చేతపట్టి
చదును చేసి,నిరుపెట్టి
ఒళ్ళు నొప్పులు
పట్టు వరకు దుక్కి
దున్ని
నడుం వంగపెట్టి
విత్తు నాటి నారు
పోసి
కునుకు మరిచి
కాపు కాసి కలుపు
తీసి
పురుగు పట్టి అప్పుచేసి మందు కొట్టి,
నారు పైరు
గా మారే సమయానికి
ఆకాశం నలుపు
రంగు పులుముకుని దాడికి
దిగితే
ఒళ్ళు మరిచి
పాణాని తడుపుకుని పంటను
కాపాడుకుని
చేతులు కొడవలై
కోత కోసి,
బస్తా నింపి
బండి కట్టి
గంపెడు ఆశల
మూటకట్టుకొని పట్నం
పోతే
సర్కార్ ఇచ్చు
ధర చేసిన అప్పులు
కన్నా తక్కువాయే
చేసిన అప్పు
నిండా ముంచెనే పాపం
చెట్టుకు వేలాడే
ప్రాణం…..
కడుపు నిండ కష్టం దాచుకుని చేసిన పంట
మెతుకై కడుపు
నింపు కుని కునుకు
తీసిన
కళ్ళుకు కనపడని
కన్నీటి కధలై పోయిన…
రోడ్డు ఎక్కి
పోరాటం నీదే అయిన
సాయంత్రం వార్తలు
లొనే నిన్ను చూసే
పాడు లోకం
ఏమి చేయగలం
ఒక నోటి మాట
తప్ప
అన్నదాత సుఖీభవ….
పంట పండించి
అందరి కడుపు నింపే
అన్నదాతకు,
కడుపు నిండే
పరిస్థితి లేదు.
ఈరోజుల్లో రైతు
అంటే ఒక సానుభూతి
చూపించడాని వాడే
ఒక వస్తువు అయిపోయింది.
నిజానికి వాళ్ళకి
కావలసింది సానుభూతి
కాదు కొంచెం గౌరవం
.
మన కడుపు
నింపుతున్న వాళ్ళకి
మనం కాస్త గౌరవం
ఇద్దాం.
ఏమి ఇచ్చిన మన రైతన్నల రుణం తీర్చగలం,
జై కిసాన్ అని నినాదించటం తప్ప...





3 Comments
Nice
ReplyDeleteBshankanarro
ReplyDelete9866775816
ReplyDelete