తెలుగు నేల మీద పుట్టి  

ఇంగ్లీష్ మీడియం చదువుల్లో పడిపోయి, 

చదువులు తర్వాత ఉద్యోగాలు అంటూ మళ్ళీ ఇంగ్లీష్ భాష  లో పడిపోయి 

పుట్టుకతో వచ్చిన మాతృభాష అయిన తెలుగును మరిచిపోతున్న తరం ఇది.

తెలుగు భాషలో.పుట్టిన ఇంగ్లీష్ భాష చదువుల కారణం గానే కావచ్చు , తెలుగుభాష గొప్పతనం,మాధుర్యం నేటి తరానికి తెలియకపోవచ్చు.

ఇంగ్లీష్ మీడియంలో చదివేసామ,

మార్కులు వచ్చేసాయా,

మంచి కంపెనీలో ఉద్యోగం పట్టేసామ  హమ్మయ్య ఇక చాలు అనుకుంటున్నయువత ఉన్న ఈ రోజుల్లో

 తెలుగు కేవలం బాషాగా మాత్రమే, ఒక సబ్జెక్టు గానే తీసుకుంటున్న ఈ కాలంలో

ఒక ముస్లిం కుటుంబం లో పుట్టి మాతృభాష ఉర్దూ అయినప్పటికీ తెలుగు భాషలో ఉన్న గొప్పతనాన్ని గ్రహించి తెలుగు భాష పై పరిశోధన చేసిన Ph.D  చేసి డాక్టరేట్ సాధించిన అఫ్రీన్ బేగం గురించి తెలుగు వారందరూ తెలుసుకోవలసిందే.

అఫ్రీన్ బేగం తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లా బాన్సువాడ కు చెందిన ముస్లిం అమ్మాయి.ఒక ముస్లిం అమ్మాయి అయినప్పటికీ తనూ పుట్టి పెరిగిన వాతావరణం వల్ల,తన స్నేహితుల కారణంగా తెలుగులో మాట్లాడటం వల్ల,తెలుగు పుస్తకాలు చదవడం వల్ల తెలుగు పై అభిమానం పెంచుకున్న బేగం ఇంటర్ పూర్తి చేసిన తర్వాత డిగ్రీ లోBA Telugu Literature తీసుకుని కాలేజ్ టాపర్ నిలిచారు.తర్వాత తెలంగాణ విశ్వ విద్యాలయం లో MA Telugu చేసి అక్కడ కూడా టాపర్ గా నిలిచారు.ఇలా తనకు చదువుకుంటున్న సమయం లో అనేక కధ,నవల,కవిత్వాలు సంబంధించిన పుస్తకాలు చదువుతున్న బేగం వచ్చిన ఆలోచన తనని Ph.D వైపు అడుగులు వేసేలా చేశాయి.



తను చదివిన పుస్తకాల్లో తెలంగాణ కు సంబంధించిన మహిళ కవియిత్రి ల పుస్తకాలు అమెక అతి తక్కువుగా దొరికెవి,మహిళ కవియిత్రి గురించి ఆమె పరిశోధన చేయడం మొదలుపెట్టారు. ఈ అంశంపై Ph.D చేయాలని నిర్ణయించుకుని కేవలం మూడేళ్ళ కాలంలోనే పరిశోధన ను పూర్తి చేసి డాక్టరేట్ సంపాదించారు.ఈ పరిశోధ చేసే క్రమం లో బేగం అనేక కధలు,కవిత్వాలు, వ్యాసాలు రాయటం జరిగింది.

మంచి కవయిత్రి గా పెరు సంపాదించాలని, విశ్వ విద్యాలయం లో తెలుగు అధ్యాపకురాలుగా సేవలను అందించడమే తన లక్ష్యమని చెపుతారు బేగం.