![]() |
| MEET INDIA'S YOUNGEST MAYOR ARYA RAJENDRAN |
కేరళ అందమైన మరియు అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం.
దేశంలోని మిగిలిన రాష్ట్రలకు కొలమానకం ఉంటుంది కేరళ రాష్ట్రం.అలాంటి కేరళ రాష్ట్రం మరో అద్భుతమైన ఆలోచన కు శ్రీకారం చుడుతూ వార్తలో నిలిచింది.
అదే ఈ మధ్య కాలంలో జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా
రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురం మేయర్ గా 21 సంవత్సరాల అమ్మాయి ఆర్య రాజేంద్రన్ నియమించింది కేరళ రాష్ట్ర అధికార పార్టీ.
మొత్తం 100 సీట్లు గాను 51 సీట్లు తో సాధించుకున్న LDP పార్టీ అధికార యంత్రాంగం మేయర్ అభ్యర్థి గా ఆర్య రాజేంద్రన్ ప్రతిపాదించగా సభ్యులు మద్దుతు కూడా ఉండటంతో దాదాపు ఖరారు అయిపోయింది.
ఇంతకీ ఎవరూ ఈ ఆర్య రాజేంద్రన్….
కేరళ రాష్రం తిరువనంతపురం లోని నివసిస్తున్న ఎలక్ట్రిషన్ రాజేంద్రన్, LIC ఎజెంట్ శ్రీలత దంపతుల కుమార్తె ఆర్య రాజేంద్రన్.తిరువనంతపురంలోని ఎల్బీఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఆర్య రాజేంద్రన్ డిగ్రీ చదువుతున్న ఆర్య
రాజేంద్రన్ కుటుంబం మొదట నుండి CPI(M) పార్టీకి విధేయులుగానే వున్నారు.దానితో ఆర్య రాజేంద్రన్ కూడా చిన్నప్పటి నుండి పార్టీ కార్యకలాపాలలో ఉత్సాహంగా పాల్గొ నే వారు.
ఆర్య రాజేంద్రన్ ప్రస్తుతం స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.
కరోన సమయం లో ఆమె చేసిన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం ,తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికలలో ఆర్య రాజేంద్రన్ కు ముదవన్‌ముగల్ వార్డు కు పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపగా విజయం సాధించారు ఆర్య రాజేంద్రన్.
మేయర్ అభ్యర్థులు పోటీ చేసిన పార్టీ సీనియర్ నాయకులు ఓటమిపాలు అవ్వటంతో ఇప్పుడు మేయర్ పదవికి ఆర్య రాజేంద్రన్ ఒకరే అర్హులు అని పార్టీ నిర్ణయం తీసుకుని మేయర్ గా ఆర్య రాజేంద్రన్ ను ప్రకటించనుంది.
పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్న ఒక ఆదేశం గా మాత్రమే పాటిస్తానని,ప్రజలకు సేవలు అందించడానికి తాను ఎప్పుడు సిద్ధమని చెపుతున్నారు ఆర్య రాజేంద్రన్.
అతి చిన్న వయసులో మేయర్ గా ఎన్నిక అయిన ఆర్య రాజేంద్రన్ ,దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్‌గా రికార్డు ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య పేరిట ఉన్న రికార్డు ను చేరిపి కొత్త చరిత్ర ను సృష్టించారు.ఆమె 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టిక్కెట్‌పై పోటీ చేశారు. 26 ఏళ్ల వయసులోనే మేయర్‌గా ఎన్నికయ్యారు.
ఆర్య రాజేంద్రన్ కు శుభాకాంక్షలు తో......




1 Comments
Wow,congratulations madam
ReplyDelete