
ఈ సృష్టి లభించే ఏ ఒకటి కూడా వ్యర్థం కాదు.
మన ఇంట్లో నే ఎన్నో వ్యర్ధ పదార్థాలు నుండి,వస్తువులు నుండి తిరిగి వేరే అవసరాలకు గాను,అందమైన వస్తువులుగాను తయారుచేస్తూ ఉంటాం.
కూరగాయలు వ్యర్ధ పదార్థాలు నుండి మొక్కలకు బలాన్ని ఇచ్చే ఎరువును తయారు చేస్తాం,
చిత్తు కాగితాలు ఉపగించి అందమైన అకృతులను తయారుచేస్తాం,
ప్లాస్టిక్ వస్తువుల్ని కుండీల గాను ఉపయోగిస్తూ ఉంటాం.
ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు రావడం సాధారణ విషయమే.
కానీ ఓ పబ్లిక్ టాయిలెట్ ను వేరే విధం గా ఉపయోగించగలమ…
ఒకసారి ఆలోచించండి…
టాయిలెట్ కదా కొంచెం కష్టమే అనుకోవచ్చు కదా…
అది పెద్ద కష్టం ఏమి కాదు అని నిరూపించింది ఒక IAS ఆఫీసర్.నిరుపయోగంగా ఉన్న ఒక టాయిలెట్ ను అందరికి ఉపయోగపడేలా మార్చాలనుకుంది
ఆ టాయిలెట్స్ ను ఒక అందమైన ఆర్ట్ గ్యాలరీ గా మార్చింది ఆమె.
తమిళనాడు రాష్టం, ఊటీ అది.అక్కడ పని చేస్తున్న IAS ఆఫీసర్ సుప్రియ సాహు.ఆమెకు వచ్చిన ఆలోచన యిది.
నిరుపయోగంగా ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ ను ఎలాగైనా అందరికి ఉపయోగపడేలా చేయాలనుకున్నారు,అనుకున్న వెంటనే అక్కడ మున్సిపాలిటీ అధికారులకు ఆ భవనాన్ని అందమైన ఆర్ట్ గ్యాలరీ గా మార్చమని ఆదేశాలు ఇవ్వడం పబ్లిక్ టాయిలెట్స్ కాస్త అందమైన ఆర్ట్ గ్యాలరీ గా మారిపోయింది.

అక్కడ నివసిస్తున్న వారే కాక సందర్శకు లకు ఆర్ట్ గ్యాలరీ సందర్శన స్థలంగా మారిపోయింది.
గ్యాలరీలో ఎన్నో అందమైన అలరించే,ఆకట్టుకునే చిత్రాలను అక్కడ ఉంచారు అధికారులు.
0 Comments