చల్లని సాయంత్రం పూట ఒక సమోసా తిని 

వేడిగా ఒక టీ తాగితే వచ్చే అనుభూతే వేరు కదా…

అందుకే మన భారతదేశం లో ఎక్కువ మంది ఇష్టపడేది, ఎక్కువగా అమ్ముడుపోయే చిరుతిండ్లు(snacks) లో సమోసా ఎప్పుడు అగ్రస్థానంలో ఉంటుంది.సాయంత్రం కాగానే భారతదేశపు రోడ్లుపై ఎక్కువుగా జరిగే వ్యాపారం సమోసాదే.

అలాంటి మన దేశపు సమోసాకు ఒక బ్రాండ్ తీసుకురావలనుకున్నారు ఇద్దరు వ్యక్తులు వారే దీక్ష పాండే,అమిత్ నాన్వాని.

బెంగుళూరు నగరం లో 2017 సంవత్సరం లో Samosa Party పేరుతో సమోసా,కాఫీ లతో మాత్రమే మొదలై,తర్వాత వివిధ స్నాక్స్ కలుపుకుని, ఈరోజుకి బెంగుళూరు నగరం లో 7 బ్రాంచ్ లతో విజయపథంలో నడుస్తోంది Samaosa Party.

కేవలం కేఫ్ తో మాత్రమే ఆగిపోకుండా నగరం లో జరిగే వ్యక్తిగత కార్యక్రమలకు,వృత్తిరీత్యా జరిగే కార్యక్రమలకు సమోసా లన ఆర్థర్ తీసుకుని పంపిణీ చేయడం కూడా మొదలుపెట్టింది Samosa Party.

ప్రతినెలా సగటున 2 లక్షల సమోసలు అమ్ముడు అవుతున్నారు చెపుతున్నారు పాండే, అమిత్.

అమిత్,NIT భూపాల్ లో సాంకేతిక విద్య ను అభ్యసించారు.

దీక్ష పాండే,వివిధ ప్రఖ్యాత ఆహార సంస్థలు అయిన ఒబారాయి హోటల్స్,పిజ్జా హట్ వంటి వాటిలో వివిధ హోదాలో పని చేసిన అనుభవం ఉంది.వీళ్ళ ఇద్దరు కలిసి Samosa Party ప్రారంభించారు.

చిన్న StartUp కంపెనీ గా మొదలై 

బెంగుళూరు లో 7 శాఖలు,

సగటు 2 లక్షలు సమోసలు అమ్మకం,

30,000 వరకు సమోసల ఆర్థర్ లతో,

80% నిత్య వినియోగదారుల తో

2019-20 సంవత్సరం లో 7 కోట్ల రన్ రేటు తో ముందుకు సాగుతుంది.

ఇప్పుడు వాళ్ళ samosa party ని దేశంతటతో పాటు విదేశాల్లో కూడా విస్తరించాడాని ప్రయత్నం లో వారితో చేతులు కలుపుతుంది ఒక ప్రముఖ పెట్టుబడుల సంస్థ.

రాబోయే పెట్టుబడులతో SamosaParty ని ప్రముఖ నగరాలు అయిన హైదరాబాద్, చెన్నై,కలకత్తా లతో పాటు విదేశాలకు విస్తరించడంతో పాటు మా వినియోగదారుల కు మరింత నాణ్యత ఆహారాన్ని అందించాలని,అలాగే మరి కొన్ని భారతదేశ పు చిరుతిళ్ళు ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాం అంటున్నారు పాండే,అమిత్.

Samosa Party మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ...