జిలుమోల్ మారియట్ థామస్,
చేతులు లేకుండా పుట్టించి ఎలా బతుకుతావో చూస్తా అని సవాల్ విసిరిన ఆ దేవుడు పై గెలిచింది ఆమె.
పుట్టుకతో నే చేతులు లేకుండా పుట్టింది జిలుమోలు. తనకు ఊహ తెలిశాక తోటి పిల్లలను చూసి తనకు చేతులు లేవని గ్రహించింది.చేతులు లేవు అని ఎప్పుడు నిరాశ చెందలేదు.తన కాళ్ళను చేతులుగా మలుచుకుంది.తన పనులను తానే చేసుకోవడం నేర్చుకుంది.ఎంతో కష్టపడి కాళ్లతో రాయటం నేర్చుకుంటూ, తన విద్య ను పూర్తి చేసింది.చదువు పట్ల జిలుమోలు కు ఉన్న ఆసక్తి ని గమనించిన పాఠశాల యాజమాన్యం ఆమెకు ఉచిత విద్యను కల్పించింది.
తన చదువుకుంటున్న సమయంలో తనకు ఎదురైన అవమానాలు తన లోని నైపుణ్యనాని బయటకు తీశాయి. చదువుతో పాటు ఎదో ఒక ప్రత్యేక ను ప్రపంచానికి చూపించాలి అనుకుంది. కాళ్లతో చిత్రాలు గీయడం నేర్చుకుంది.ఆమె కాళ్లతో గీసిన చిత్రాలు ఎన్నో ప్రదర్శన లో ప్రదర్శించబడ్డాయి.
అలా ఆమె అనేక చిత్రాలు గిసింది.
చిత్రాలు గియటంలో ఉన్న ఇష్టం ఆమెను గ్రాఫిక్ డిజైనింగ్ వైపు అడుగులు పడేలా చేసింది.
డిగ్రీ పూర్తి చేసి,గ్రాఫిక్ యానిమేషన్ నేర్చుకుని ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన జిలమోలు కు అక్కడ ఎదురు దెబ్బలు తగిలాయి. చాలా కంపెనీలు ఆమెకు చేతులు లేకపోవడం తో ఆమెకు అవకాశాన్ని కల్పించేవి కావు.జిలమోలు గురించి తెలుసుకున్న వియని ప్రింటింగ్స్ సంస్థ ఆమెను ఎలాంటి మౌఖిక పరీక్షలు లేకుండా నేరుగా ఉద్యోగ అవకాశాన్ని కల్పించింది.
ఉద్యోగం చేస్తూనే , ఆమె చిన్ననాటి కల అయిన కార్ డ్రైవింగ్ ను నేర్చుకోవాలి అనుకుంది.తల్లిదండ్రులు కు చెప్పింది,వాళ్ళు ముందు ఒప్పుకోలేదు కానీ కూతురు పై ఉన్న నమ్మకం తో ఒప్పుకుని మారుతి సెలెరియో-ఆటోమేటిక్ కారు కొని ఇచ్చారు. పట్టుదలతో కారును ఆరు నెలలు లొనే డ్రైవింగ్ నేర్చుకుంది.
ఇప్పటి వరకు ఎన్నో సవాలు ఎదుర్కొన్న జిలమోలు కు ఇక్కడ కూడా ఒక సవాల్ ఎదురైంది. తనకు డ్రైవింగ్ లైసెన్స్ అర్హత కల్పించాలని హైకోర్టు ను ఆశ్రయించింది. కోర్టు తనకు అనుమతి ని ఇచ్చింది.2014 సంవత్సరం లో తోడుపుళ రవాణా కార్యాలయం లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా,
అక్కడ అధికారి ఇంతకు ముందు ఎవరైనా ఇలా చేతులు లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉంటే వారి యొక్క వివరాలు తో రమ్మని అడిగారు.జిలమోలు కు అది పెను సవాల్ గానే మారింది.పరిశోధన చేయగా ఒక వ్యక్తి అలా చేతులు లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన విక్రమ్ అగ్నిహోత్రిని కనుగొనడా నికి జిలుమోల్ చేసిన శ్రమకు కూడిన ఫలితాలు వచ్చాయి.
దానితో ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసింది.
చేతులు లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి మహిళ గా జిలమోలు చరిత్ర సృష్టించింది.
అంతే కాదు ఆమె ఒక YouTube ఛానెల్ కూడా నడుపుతుంది,28 వేల పైగా మంది ఆమె ఛానెల్ ను అనుసరిస్తున్నారు.
పట్టుదల తో ఉంటే జీవితాన్ని గెలవచ్చు అని నిరూపించారు జిలమోలు....





0 Comments