కరోన చాలా మంది జీవితాల్లో చీకట్లు నింపింది,అందులో కొంత మంది ఆ చీకట్లు నుండి కొత్త వెలుగును చూడడానికి ప్రయత్నం చేసి విజయం సాధించి సరి కొత్త జీవితానికి పునాది వేసుకున్నారు.
అలాంటి వాళ్లలో ఒకరు రేవన్ షిండే.
మహారాష్ట్ర లో పూణే దగ్గర ఉన్న పింపరి చించువాడ ప్రాంతానికి చెందిన వాడు రేవన్.
అతను ఒక కంపెనీలో సెక్యూరిటీ గాడ్ గా పనిచేసే వాడు.కరోన కారణం తో ఆ కంపెనీ మూతపడింది. ఉన్న ఉద్యోగం పోయి,కొత్త ఉద్యోగం రాకపోవడం తో తానే స్వయం ఏదైనా వ్యాపారం చేయలనుకున్నాడు.
అప్పుడు రేవన్ కు వచ్చిన ఆలోచన టీ అమ్మకం.ఏదైనా ఒక షాప్ తీసుకుని ప్రారంభించాలనుకున్నాడు,కానీ సాధ్యపడలేదు.అయిన తన ప్రయత్నం ఆపలేదు.
తనే స్వయంగా కార్యాలయాల,సంస్థల వద్ద కు వెళ్లి అమ్మలనుకున్నాడు కరోన కారణం గా అది కొంచెం కష్టం అయింది రేవన్ కు అయిన తన ప్రయత్నన్నీ ఆపలేదు.
ప్రారంభించిన కొత్తలో చాలా మంది రేవన్ టీ తాగేయందుకు భయపడే వారు.
అందుకు గాను రేవన్ కొంత కాలం తన టీ ని ఉచితం గా సరఫరా చేసేవాడు.
కొన్ని రోజులకి జనాలకు రేవన్ టీ నచ్చడం తో రోజు తాగటానికి అలవాటు పడ్డారు.
ఇప్పుడు రేవన్ రోజుకు సుమారు 700 కు పైగా తన టీ అమ్మకాలు చేసి నెలకు 50000 లకు పైగా సంపాదిస్తున్నారు రేవన్.
ఒక వడ్రంగి కుటుంబంలో పుట్టి, కేవలం ఇంటర్ మాత్రమే చదివి ,సెక్యురిటి గార్డ్ గా పనిచేసిన రేవన్ తాను ప్రారంభించిన టీ వ్యాపారం ద్వారా తనలా ఉపాధి కోల్పోయిన మరి కొంత మందికి ఉపాధి కల్పించి,
తను ప్రారంభించిన వ్యాపారం నికి అభిమన్యు అని పేరు పెట్టాడు.
కేవలం 12000 జితానికి పనిచేసిన తనకు కరోన ఒక కొత్త మొదలపెట్టెలే చేసిందని,
ఇప్పుడు కేవలం ఒక అల్లం టీ మాత్రమే తము అమ్ముతున్నాం,త్వరలో తినే పదార్ధాలను కూడా అమ్మడానికి ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు రేవన్…



0 Comments