ఫోటో….

ఆనంద.క్షణాలను,

మరుపురాని అనుభూతులను చేరిగిపోకుండా,

 ఎప్పటికి మనతో ఉండే

ఒక జ్ఞాపకం….

అలాంటి క్షణాలను,భావాలను గమనించి పట్టుకుని ఫోటో తీయటం అంటే ఒక ఫోటోగ్రాఫర్ కు ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి.

ఛాలెంజ్ ను ఫోటోగ్రాఫర్ తీసుకోవాలి అనుకుంటే తనకు అనుభూతులు,భావాలు తప్పనిసరిగా తెలిసి ఉండాలి.

కదిలే మనుషుల్ని,వాళ్ళు పలికే భావాలను,ఆనందాలని ఫోటో తీయటం ఒక ఎత్తు అయితే 

ఉలుకు పలుకు లేని ప్రకృతి చేత భావాలను పలికించడం,

మనిషి పలికే అనేక భావాలను పట్టుకోవడం

 ఒక్క ఫోటోగ్రాఫర్ కె సాధ్యం.

అలాంటి ఫోటోగ్రఫీ ని అమితంగా ఇష్టపడి,

ఫొటోగ్రఫీనే తన జీవితం గా మార్చుకున్నడు

 ఫోటోగ్రాఫర్  గణేష్ కంఠంశెట్టి...

ఆంధ్ర రాష్ట్రం అంతా ఇష్టపడే కోనసీమ,అమలాపురం లో ఉన్న ప్రముఖ ఫోటోగ్రాఫర్స్ లో ఒకరు గణేష్ కంఠంశెట్టి.

యువకులను  స్టైల్ గా చూపించడం లో తనకు తానే సాటి అందుకే  గణేష్ తో ఫోటోషూట్ కోసం ఎగబడుతుంటారు.

అలాగే  ప్రకృతిని  చాలా అందంగా చూపించగలడు కూడా.

సాధారణ కళ్ళకు కనిపించని ఎన్నో అందాలను తన కెమెరా ద్వారా అందరికి చూపిస్తున్నాడు గణేష్.

కొలిమి లో పడితే గాని బంగారానికి మెరుపు రాదు,

నాగలి పోటు పడితే గాని భూమికి సారం రానట్టు

ఎన్నో కష్టలు, జీవితం లో ఎదురైన సంఘటనలు గణేష్ ని ఫోటోగ్రఫీ వైపు అడుగులుపడేలా చేశాయి.

ఏన్నో ఒడిదుడుకులు మధ్య MBA వరకు తన విద్యను సాగించని గణేష్,చిన్నతనం నుండి అనేక కష్టాలు చవిచూశాడు, అనేక చోట్ల పనిచేసే వాడు.అలా తాను పనిచేస్తున్న హోటల్ ఉన్న ఒక ఫోటో తనని అమితంగా గా ఆకట్టుకుంది. తాను కూడా అలాంటి ఫోటో తీయాలని కోరిక కలగడంతో తో తన దగ్గర ఉన్న మొబైల్ తో ఫోటో లు తీయటం మొదలుపెట్టాడు,అలా మొదలైన తన ప్రయాణంలో

తర్వాత చిన్న కెమెరా కొనుక్కుని తన లో ఉన్న టాలెంట్ ఉపయోగించి ఆ కెమెరా తో షూట్ లు చేసి,అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.

గణేష్ లో టాలెంట్ ను సోషల్ మీడియా లో చూసిన రాజమండ్రి కి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ రాకేష్ ,గణేష్ లోని టాలెంట్ కు పదును పెట్టేలా సలహాలు సూచనలు చేసేవారు.

గణేష్ కెమెరా కి చిక్కిన కొన్ని అద్భుతాలు...








మరి కొన్ని కోసం..
Facebook - Ganesh Kantamsetti 
Twitter- @ganikantamsetti
Instagram - @ganikantamsetti

క్రమక్రమంగా గణేష్ ,లఘు చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేయటం మొదలుపెట్టారు.ఈ క్రమంలో కొన్ని లఘు చిత్రాలకు దర్శకుడు గాను,ఎడిటర్ గాను పనిచేశారు.

రామ్ గోపాల్ వర్మ దర్శక శైలి,

తమిళ దర్శకుడు బాల సహజ చిత్రీకరణ శైలి,

 అంటే గణేష్ ఇష్టం,బహుసా దాని కారణం గా నే తను తీసే ఫోటో లో ఎక్కువుగా సహజతత్వం ఎక్కువుగా ఉట్టిపడుతుంది.

ఇప్పటి వరకు దర్శకుడిగా 3 లఘు చిత్రాలు,కెమెరామెన్ గా 40 లఘు చిత్రాలకు పనిచేసారు.

ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది,దాని వృధా చేయకూడదు అని భావించే తనకి,మొత్తం ప్రపంచాన్ని తన కెమెరా లో బంధించాలనదే తన ఆశయం గా అందరి ఆకట్టుకునే విధంగా కష్టపడి పనిచేస్తున్న  గణేష్ కు

తన ఆశయం నెరవేరాలని,

జీవితంలో మరింత ఉన్నత స్థాయికి తన ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటూ...

All The Best.....