తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ విభాగం జరుపుతున్న పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమం జరుగుతుంది.రాష్ట్ర పోలీస్ లు తో అక్కడ ప్రాంతం కోలాహలంగా  ఉంది.
అక్కడికి వచ్చే పోలీస్ ల భద్రత కోసం DSP స్థాయి ఒక ప్రత్యేక మహిళ పోలీస్ అధికారి పనిచేస్తున్నారు.
ఇంతలో అక్కడే పనిచేస్తున్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ అధికారికి సెల్యూట్ చేసారు.
ఉన్నత స్థాయి అధికారులకు కింద స్థాయి అధికారులు సెల్యూట్ చేయడం లో పెద్ద విషయం ఏముంది అనుకోవచ్చు.
కానీ ఉన్నత అధికారి,కింద స్థాయి అధికారి కూతురు అయితే..
డ్యూటీ మీట్ లో విధులు నిర్వర్తించడానికి వచ్చిన DSP ప్రశాంతి కి,అక్కడే పోలీస్ శిక్షణ కేంద్రం లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న తన తండ్రి  శ్యామ్ సుందర్  సెల్యూట్ చేయడం లో ఆ  ప్రత్యేకత ఉంది.

పోలీస్ ఉద్యోగం చేయడం లో అనేక కష్టాలు ఉంటాయి,కుటుంబానికి దూరంగా ఉండాలి,సమయం సందర్భం ఉండదు అందుకే చాలా.మంది పోలీసులు తమ.పిల్లలని పోలీస్ ఉద్యోగానికి దూరంగా ఉంచాలనుకునే ఈ రోజుల్లో తన కూతురిని  పోలీస్ అధికారి చూడాలన్న తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చారు ప్రశాంతి.
తిరుపతి లో ని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి MBAలో గోల్డ్ మెడల్ తో తన విద్య ను పూర్తి చేసిన ప్రశాంతి,
2018 కమిషన్ నిర్వహించిన గ్రూప్స్ పరీక్షలో DSP గా ఎంపిక అయి గుంటూరు జిల్లా లో పనిచేస్తున్నారు ప్రశాంతి.
 పోలీస్ లు గా పనిచేసిన తన తాతయ్య,తండ్రి తన ఆదర్శం అని,తన తండ్రే తనకు మార్గదర్శి అంటారు ప్రశాంతి,అయితే అమ్మ నేర్పిన క్రమశిక్షణ పరోక్ష కారణం అంటారు ప్రశాంతి.
తన తండ్రి తో పనిచేయన్న కోరిక పోలీస్ డ్యూటీ మీట్ లో తీరింది అని,సమాజానికి తన వంతు సాయం అందించాలనదే తన అభిమతం గా పనిచేస్తున్నారు  ప్రశాంతి.