" నా ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి పనిచేయడం లేదంటే పారిపోవడం.నేను పారిపోవడానికి బదులు పనిచేయాలనే అనుకున్నా. శవాల పొటోలు తీయడం ఒక  అనుభవం,దాని వెనుక ఎంతో భయం,ఆందోళనతో కూడిన అనుభవం అది. ఇంత మంది ఒకేసారి చనిపోవడం సాధారణంగా జరగదు.నేను ఆ ఫొటోలును తీస్తున్న సమయంలో నా మనసులో ఎంత కల్లోలం జరిగిందో మాటల్లో చెప్పలేను" అన్నారు అరుణ్ శర్మ.

అరుణ్ శర్మ,ఒక ఫోటోగ్రాఫర్. ఆయన పదిహేను సంవత్సరాలు గా ఫోటో జర్నలిజం లో పనిచేస్తున్నారు.
భారతదేశం లో కరోన విలయ తాండవం ఏ మేరకు ఉందో చెప్పేలా కొన్ని ఫోటోలను తీసి ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసారు.ఆయన కు ఎదురైన ఆ అనుభవం గురించి ఆయన మాటల్లో….


" నేను చాలా ప్రాంతాల్లో కరోన పరిస్థితి ఎలా ఉంది,కరోన సోకిన వాళ్ళు ఆరోగ్య పరిస్థితులు, ఆసుపత్రిలో కరోనకు చికిత్స ఎలా జరుగుతుంది.ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి అణా విషయలపై నేను పనిచేసేవాడ్ని.కరోన మృత్యు గణాంకాలు గురించి వింటూ ఉండేవాడ్ని కానీ ప్రత్యేకంగా చూస్తే గాని నాకు పరిస్థితులు ఎలా ఉన్నాయి నాకు అర్ధం కాలేదు.

ఒక రోజు నా మిత్రుడు ఒకడు నాకు ఒక వీడియో ను పంపించాడు.ఆ వీడియో ను చూసిన తర్వాత నాకు ఏమి చేయాలో తెలియలేదు.
ఆ వీడియో లో ఒక శ్మశానవాటికలో కాలుతున్న చితి మంటలు ఉన్నాయి.అప్పుడు అనుకున్న చాలా మందికి నాలాగే తెలియదు అనుకుంటూ,కరోన వల్ల ఎంతమంది మృత్యువాత పడుతున్నారు అని.
అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్న ఇక పై తను శ్మశానవాటికలో జరుగుతున్న మృత్యుఘోష పై పనిచేయాలని,అందరికి ఈ విషయం చెప్పాలని.

నేను మొదటిసారిగా కాన్పూర్ లోని భైరవ ఘాట్ కు వెళ్ళాను.
అక్కడ వెలుగుతున్న చితిమంటలతో ఆకాశం కూడా ఎర్రగా మారిపోయింది.పొగలతో ఆ ప్రదేశం మొత్తం నిండిపోయింది. పక్కనే ఉన్న చెట్లు కూడా మాడి మసి అయిపోయాయి.
దాదాపుగా పన్నెండు మంది వస్తున్న శవాలను కాల్చడానికి పనిచేస్తున్నారు.ఇది లోపల
అయితే బయట అయినవాళ్లను కోల్పోయి బాధతో అహకారాలతో, ఏడుపులతో ప్రాంతాం మొత్తం శోకంతో నిండిపోయింది.

అదంతా చూసిన తర్వాత నాకు ఎదురుగా రెండు మార్గాలు కంపించాయి.ఒకటి పనిచేయడం లేదంటే పారిపోవడం.నేను పారిపోవడానికి బదులు పనిచేయాలనే అనుకున్నా. శవాల పొటోలు తీయడం ఒక  అనుభవం,దాని వెనుక ఎంతో భయం,ఆందోళనతో కూడిన అనుభవం అది. ఇంత మంది ఒకేసారి చనిపోవడం సాధారణంగా జరగదు.నేను ఆ ఫొటోలును తీస్తున్న సమయంలో నా మనసులో ఎంత కల్లోలం జరిగిందో మాటల్లో చెప్పలేను.ఆ తర్వాత మరికొన్ని ప్రాంతాలకు వెళ్లిన అక్కడ అదే పరిస్థితి ఉంది.నా అనుభవం లో ఇలాంటి పరిస్థితి నేను చూస్తానని గాని,ఎదురు అవుతుంది నేను ఎప్పుడు అనుకోలేదు.

ఎక్కడో జరిగింది మనదాక రాదు అని అనుకోవద్దు.బయట వార్తలు అలానే వస్తాయి అని అజాగ్రత్తగా ఉండద్దు" అన్నారు అరుణ్ శర్మ.