కమ్ముకున్న చీకట్లు ను,తన కలం తో తెగనరికిన కవి…
నిద్రపోతున్న ప్రపంచానికి,మరో ప్రపంచాన్ని పరిచయం చేసిన కవి….
సముద్ర కెరటాలుకు ఎదురెళ్లి తీరానికి దిశను చూపిన కవి…
ఈ యుగం నాదే అని ధైర్యం గా చెప్పిన కవి….
ఆయనే" మహాకవి"శ్రీశ్రీ….
తెలుగువాడి గా పుట్టిన ప్రతివారికి, వాడిగా తెలిసిన పేరు.
సాహిత్యం తో పరిచయం ఉన్నవారికి మార్గదర్శి.
ఒకే మార్గం లో వెళ్తున్న తెలుగు సాహిత్యానికి దిశ,దశ మార్చిన ఆధునిక కవితపితామహుడు శ్రీశ్రీ.
ఏప్రిల్ 30,శ్రీశ్రీ జయంతి గా తెలుగు సాహిత్యం పండగల చేసుకునే రోజు.
కానీ శ్రీశ్రీ పుట్టిన తేదీ.పై పలు వాదనలు ఉన్న అప్పటి విశాఖపట్నం పురపాలక సంఘం స్పష్టం చేసిన కారణం గా శ్రీశ్రీ జయంతిగా ఏప్రిల్ 30 తేదీని నిర్వహిస్తారు.
శ్రీశ్రీ తనలో కలిగే భావాలకు,
కంటికి కనిపించే వాస్తవాలకు
అక్షరరూపం ఇవ్వడం చిన్నతనం లొనే మొదలుపెట్టారు.
చిరిగిపోయిన కాగితాలపై,సిగరెట్ ప్యాకెట్ అట్టపై కవితలు రాస్తూఉండే వారు.
అలా తన పద్దెనిమిది ఏటా ప్రభవ అనే కవిత సంపుటి ని రచించారు. తరువాత వారం వరం, సంపెంగి తోట రచనలు చేసారు.
1950 లో ఆయన రచించిన " మహాప్రస్థానం" ప్రచురించబడింది.
మహాప్రస్థానం తో ఆధునిక కవిత్వాన్ని ప్రస్థానం ముందు,ప్రస్థానం తర్వాత అని విభజించారు.
మహాప్రస్థానం కవిత సంకలనం లో కార్మిక,కర్షక, శ్రామిక వర్గాలను ఉత్తేజపరచడానికి రచించిన అన్ని వర్గాల్లోనూ ఒక కొత్త మార్పును తీసుకువచ్చేలా చేసింది.
దానితో శ్రీశ్రీ ని ఆధునిక కవితపితామహుడు గా అభివర్ణించారు.
ఆ తర్వాత ఆయన రచించిన సిప్రాలి,అనంతం,లెనిన్ మొదలైనవి ఎన్నో విప్లవ రచనలు ద్వారా మార్పు తెచ్చారు మహాకవి శ్రీశ్రీ.
శ్రీశ్రీ కవిత సరళిని గాని,ఆయన రచన శైలీ గురించి మాట్లాడే స్థాయి,అర్హత గాని నాకు లేదు అందుకే ఆయన రచన లో నుండి కొన్ని అద్భుతాలు మీ కోసం…














0 Comments