" ఫాజిల్ ను చూసిన ప్రతిసారి,చావు తనకు కాదు మాకు అన్పిస్తోంది. తన జీవితాన్ని తనకు ఇచ్చేయందుకు తన దగ్గర ఏమి లేదు అని ,అందరిని సహాయం చేయమని కోరడం తప్ప.
తన మూడు సంవత్సరాల కొడుకుని క్యాన్సర్ బారి నుంచి కాపాడి,జీవుతాన్ని ప్రసాదించమని.
అలాగే క్యాన్సర్ తో బాధ పడుతున్న తన కుమారుడికి బలాన్ని ఇవ్వమని ప్రార్ధించమని ఆ ప్రార్థన లే తన కుమారుని రక్షిస్తాయని ప్రార్ధించమని,
కాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న తమకు సహాయం చేయని " కోరుతున్నారు ఫాతిమా.
కర్ణాటకలోని బెంగుళూరు లో ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో ఫాజిల్ కు కీమోథెరపీ వైద్యం జరిగేది.
కీమోథెరపీ అంటే శరీరం లో పెరుగుతున్న క్యాన్సర్ కణలను నాశనం చేసేందుకు,వాటిని అదుపులో పెట్టేందుకు ఉపయోగించే ఒక రకమైన వైద్యం.
ఫాజిల్ లుకెమియా తో బాధపడుతున్నాడు.లుకెమియా అంటే సాధారణ భాషలో చెప్పాలంటే బ్లడ్ కాన్సర్.
బ్లడ్ కాన్సర్ వల్ల శరీరం లో తెల్ల రక్తకణాలు నశించుకుపోయి,రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్ సోకె ప్రమాదం ఉంటుంది.
మూడు సంవత్సరాల ఫాజిల్ ఇప్పుడు కాన్సర్ తో పోరాటం చేస్తున్నాడు.
ఫాజిల్ తల్లి ఫాతిమా,తండ్రి ఇద్దరు కర్ణాటకలో ని మారుమూల ప్రాంతం నుండి బెంగుళూరుకు వలస వచ్చారు.ఫాజిల్ తండ్రి ఒక ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవారు.వచ్చిన డబ్బులతో వారి కుటుంబం సాధారణ జీవిస్తున్న సమయం లో కరోన వారికి సవాల్ విసిరింది.పనులు ఏమి రాక,డబ్బులు లేక అవస్థలు.పడుతున్న సమయం లో మరో.పెను ప్రమాదం వారి జీవితం లోకి ప్రవేశించింది.అదే ఫాజిల్ కాన్సర్ వ్యాధి.
రోజు ఆడుతూ ఉండే ఫాజిల్ ఆరోగ్య పరిస్థితి చేయిదాటిపోయింది.
ఊర్లో ఉన్న ఆస్తులు.అమ్మి,అప్పులు తెచ్చి ఫాజిల్ కు కీమోదేరాఫీ చేయించారు.
ఆసుపత్రి వారు ఫాజిల్ కు కాన్సర్ ను నయం చేయాడానికి చేయవాలిసిన వైద్యానికి కావాల్సిన మొత్తాన్ని వారికి చెప్పారు. ఆ మొత్తం అక్షరాల పద్నాలుగు లక్షలు.
ఆ తల్లిదండ్రులకు వచ్చిన పరిస్థితి కొడుకు జీవితమా,ఆ మొత్తామా, ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు.
అయితే కీటో అనే స్వచ్ఛంద సంస్థ ఫాజిల్ వైద్యానికి కావాలిసిన మొత్తాన్ని సేకరిస్తుంది.
ఫాజిల్ అంటే నాకు ప్రపంచం. ఇంత చిన్న జీవితం నాకు ఎప్పటికీ తెలియదు, ఇంత భారీగా నన్ను ప్రభావితం చేస్తుంది. నేను నా జీవితమంతా భక్తుడైన ముస్లింను, కాని నా బిడ్డను కాపాడాలన్న నా పిలుపుకు శ్రద్ధ చూపే ఏ దేవుడినైనా ప్రార్థిస్తున్నాను అంటున్నారు ఫాజిల్ తండ్రి.
కాన్సర్ తో కాదు,
జీవితంతో పోరాడుతున్న ఫాజిల్ కు అంత మంచి జరగాలని కోరుకుంటూ…..
సహాయం చేయాలనుకున్న వారు కింది Donate Now లింక్ పై క్లిక్ చేయండి.
కీటో సంస్థ యొక్క వివరాలు,
ఫాజిల్ కుటుంబ వివరాలు,
అలాగే ఇప్పుడు దాక వచ్చిన మొత్తం,
అన్ని వివరాలు ఇక్కడ ఉంటాయి.
#SaveFazil
Donate Now...




0 Comments