ప్రస్తుతం మన దేశం లో కరోన వైరస్ తన యొక్క వేగాన్ని పుంజుకుంటుంది.కాబట్టి చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు తిరిగి లాక్డౌన్ బాట పట్టాయి.మహారాష్ట్ర,ఢిల్లీ,చతీశ్ ఘర్ మొదలైన రాష్ట్ర లు ప్రస్తుతం లాక్డౌన్ లో ఉన్నాయి.


ఒక రాష్ట్రం లాక్డౌన్ లో ఉంది అంటే ఆ రాష్ట్ర పోలీసులకే ఎక్కువ బాధ్యత ఉంటుంది.మనం ఇదే వరకే లాక్డౌన్ లొనే చూసాం పోలీసు లు తమ కుటుంబాలకు దూరం గా ఉంటూ,ప్రజలు రక్షణ కల్పించారు.అందుకు ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి మనం.ఎంతో మంది పోలీసులు తమ బాధ్యతగా ఇప్పుడు కరోన నుండి ప్రజలను రక్షించే కర్తవ్యం లో వున్నారు.


చతీశ్ ఘర్ రాష్టం లో అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ ను ప్రకటించింది.

చతీశ్ ఘర్ అంటే అక్కడ మావోయిస్టులు ప్రభావితం ఎక్కువుగా ఉండే ఒక రాష్ట్రం.మావోయిస్టులు ప్రభావం ఎక్కువుగా ఉండే బస్తర్ డివిజన్ లోని ఒక ఊరు దంతేవాడ లో ఒక మహిళ అధికారి డ్యూటీ చేస్తూ లాక్డౌన్ నియమాలను ఉల్లఘించి రోడ్లు పైన తిరుగుతున్న కొంత మంది అడ్డుకుని వారి కారణాలు తెలుసుకుంటున్నారు.

అయితే లాక్డౌన్ లో పోలీసులు అదే చేస్తారు గా అందులో పెద్ద విషయం ఏమి ఉంది అనుకోవచ్చు గాని.

ఆ మహిళ పోలీసు అధికారి ఐదు నెలల గర్భవతి. సాధారణంగా మాములు వాళ్ళు ఈ పాటి ఎండలకు బయటికి రావడానికి భయపడే రోజుల్లో ఒక గర్భవతి అయిన ప్రజల శ్రేయస్సు తనకు ముఖ్యమని తన సెలవులు తప్పించి తిరిగి డ్యూటీ లో జాయిన అయ్యారు DSP శిల్పాసాహు.



ఆమె మావోయిస్టులు ప్రాబాల్యం ఎక్కువు ఉన్న ప్రాంతాం లో తన డ్యూటీ చేస్తున్నారు అంటేనే అర్ధమవుతుంది.ఆమెకు ఎంత ధైర్యం అని.



" తాను డ్యూటీ లోకి తప్పక రావాల్సిన సమయం వచ్చినప్పుడు తను ఇంట్లో ఉండేందుకు తనకు ఇష్టం కాదని అంటారు శిల్పా సాహు.

తన యొక్క దళం తో ,ప్రజలు ఎవరు రోడ్లు పైకి రాకుండా గస్తీ కాస్తున్నారు.