మమతా బెనర్జీ….

ధైర్యసాహసాలకు గడ్డ,

ఆదిపరాశక్తి కాళిక ను పూజించే బెంగాల్ ప్రజలు 

ముద్దు గా దీదీ అని పిలుచుకునే

 బెంగాల్ మహిళ ముఖ్యమంత్రి ఆమె.

భారతదేశ రాజకీయాల్లో బాగా వినిపించే పేరు.

నిన్న ఎన్నికల ఫలితాలతో వరసగా మూడో సారి ముఖ్యమంత్రి గా బెంగాల్ పీఠం అధిరోహించబోతున్నారు ఆమె.


ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి బెంగాల్ ప్రజలందరి కుటుంబాలలో ఒకరిగా కొనసాగుతున్న ఆమె ప్రయాణం లో అనేక కష్టాలు,అవమానాలు,వెన్నుపోట్లు అన్నింటిని ఆమె చవిచూశారు.





1955,జనవరి 5 న జన్మించారు దీదీ.

ఇరవై సంవత్సరాల వయస్సు లొనే 1975 లో కాంగ్రెస్ పార్టీలో చేరి అతి తక్కువ సమయం లొనే పార్టీ లో కీలక సభ్యులుగా ఎదిగారు.

1984 లో తొలిసారిగా జాదవ్ పూర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు.కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు అయిన సోమనాథ్ చటర్జీ పై గెలిచి ఔరా అనిపించారు.

ఆ తర్వాత 1989 లో మరల అదే పార్లమెంటు స్తానం నుంచి.పోటీ చేశారు కానీ ,ఈ సారి ఆమె కు.ఓటమి ఎదురు అయింది.

1991 లో అదే పార్లమెంట్ స్థానానికి మధ్యంతర ఎన్నికలు రావడం తో మరల పోటీ చేసి గెలిచారు.

అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహరావు కేంద్రమంత్రి వర్గం లో మానవవనరులు,క్రీడ శాఖ సహాయమంత్రి గా పనిచేశారు.

ఆ తర్వాత ఎన్నికల్లో 1996 లో మరల విజయం సాధించారు.

గెలిచిన ఏడాది తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదాలు రావడం తో పార్టీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.

ఆ తర్వాత బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో మమతా మినహా మిగతా అన్ని చోట్ల ఆ పార్టీ పెద్ద గా ప్రభావం చూపించలేకపోయింది.




1999,2004,2009 సంవత్సరాల లో జరిగిన ఎన్నికల్లో మమత వరసగా గెలుస్తూనే వున్నారు.

ఇదే క్రమంలో వాజపేయి ప్రధానమంత్రి గా ఉన్న సమయం లో కేంద్ర రైల్వే మంత్రి గా నియమించబడ్డారు.ఆమె తొలి మహిళా రైల్వే మంత్రి.

అయితే 2011 సంవత్సరం లో జరిగిన ఎన్నికల్లో మమతా నందిగ్రామ్ నియోజకవర్గ నుండి పోటీ చేసి గెలిపోయిందారు.

ఆ ఎన్నికల్లో దీదీ పార్టీ కి అన్ని చోట్ల ఈ సారి బెంగాల్ ప్రజలు బ్రహ్మరథం పట్టడం తో ఎన్నికల్లో మమతా పార్టీ అధికారంలోకి వచ్చింది.తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి బెంగాల్ ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేశారు.

2015,2021 ఎన్నికల్లో కూడా మమతా విజయం సాధించి ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నరు.


ఎన్నో విజయాలు సాధించిన దీదీ చేసిన పోరాటాలు,శపధాలు, సంచలనలు కూడా ఆమె ప్రయాణం లో ఉన్నాయి.


కాంగ్రేస్ పార్టీ లో మంత్రిగా ఉన్న సమయంలో,ఆ పార్టీ చేసిన కొన్ని కార్యక్రమాలకు దీదీ మద్దతు పలికేవారు కాదు. ఒకసారి

పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా కలకత్తా లోని బిగ్రేడ్ పెరేడ్ గ్రౌండ్ లో అతి పెద్ద ర్యాలీ చేసి,తన మంత్రి పదవి కి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు.





కాంగ్రేస్ పార్టీ ప్రకటించిన బెంగాల్ బంద్ నిరసన కార్యక్రమంలో ఆమె తలపై ఎవరో దాడి చేశారు.ఆ దాడి లో మమత తీవ్రంగా గాయపడ్డారు.కష్టం అనుకున్న సమయం లో ఆమె తన పట్టుదలతో చావును సైతం జయించారు అని రాశారు ఒక పుస్తకంలో.


కేంద్రమంత్రి గా ఉన్న సమయం లో ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ సచివాలయం ముట్టడి కార్యక్రమంలో పోలీసులు ఆమె అక్కడి నుంచి పోలీసు ప్రధాన కార్యాలయం వరకు ఆమె ఈడ్చుకుంటూ వెళ్లారు.దీదీ కట్టుకున్న వస్త్రాలు సైతం చిరిగిపోయాయి.

ఆ సమయం దీదీ,

" నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేది ఒక ముఖ్యమంత్రి గా అంటూ "శపథం చేసారు.

దీదీ తన శపథం ప్రకారం తాను ముఖ్యమంత్రి గా 2011 లొనే సచివాలయంలో ప్రవేశించారీ.


1998 సంవత్సరం లో మహిళ బిల్లుకు వ్యతిరేకంగా స్పీకర్ వెల్ లోకి ప్రవేశించిన సమాజ్ వాదీ పార్టీ ఎం.పి దుర్గ ప్రసాద్ ను కాలర్ పట్టుకుని లాక్కుని రావడం.అప్పట్లో ఒక దుమారమే రేగింది అన్ని ఒక జర్నలిస్ట్ తన పుస్తకం లో రాశారు.





ఇవే కాక పోలీస్ కాల్పుల్లో మరణించిన కాంగ్రేస్ కార్యకర్తల కోసం,భూసమీకరణ చట్టం కోసం ఇలా ఎన్ని విప్లవాలు చేశారు దీదీ.

దీదీ తన ప్రయాణం లో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ..


దీదీ కి శుభాకాంక్షలు….




For Better and Best Custom E -Card Invitations

@9491255720