ఆమె విధిని జయించింది…

"మనలో మనకే తెలియని ధైర్యం ఉంటుంది,

దేనిని అయిన పోరాడే బలం ఉంటుంది "

అదే నేను నమ్ముతాను అంటున్నారు అహ్మదాబాద్ కు చెందిన మహిళ ఆటో డ్రైవర్ అంకిత.


అంకిత అహ్మదాబాద్ లో ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్న ఒక మహిళ.ఇది ఏమిటి ఒక మహిళ ఆటో నడపటం పెద్ద విషయం కాదు అని మనం అనుకోవచ్చు.కానీ అక్కడే మనకి తెలియని విషయం ఏమిటి అంటే ఆమె ఒక భిన్నమైన సామర్ధ్యం గల వికలాంగురాలు.


తన పుట్టిన మొదటి సంవత్సరం లొనే పోలియో రావటం తో తన కుడి కాలిని పొగుట్టుకున్నారు.

అయిన చిన్నప్పటి నుంచి తన కుటుంబం తనకు అండగానే నిలబడింది.

ఆర్థికశాస్త్రం లో డిగ్రీ పట్టా సాధించారు. తన విద్యను.పూర్తి చేసిన వెంటనే తన కుటుంబానికి అండగా నిలిబడేందు కు ఏదైనా ఉద్యోగం చేయాలని అనుకుని,అనేక రోజు అనేక కంపెనీలు చుట్టూ ఆమె తిరిగింది.కానీ తనకు ఆ అవకాశం దొరకలేదు.


దానికి కారణం తనకు ఇంగ్లీష్ రాదు అని చిన్న కారణం అయితే,పోలియో పెద్ద కారణంగా నిలిచింది.


ఇలా ప్రయత్నిస్తూ ఉండగా,పెద్ద సమస్య తనకు ఎదురైంది. 2019 లో తన తండ్రి కి ప్లేగు కాన్సర్ రావడం తో ఏడుగురు సంతానం గల ఆ కుటుంబం లో పెద్ద గా నిలిచిన అంకిత పైన కుటుంబ బాధ్యత పడింది.

ఒక పక్క తండ్రి అనారోగ్యం,

మరో పక్క కుటుంబ పోషణ.

గుజరాత్ లో ని పాలితాన నుండి అహ్మదాబాద్ కు కుటుంబం వలస వచ్చింది.


ఒకానొక సమయం లో లాజి బరోట్ అనే వ్యక్తి ద్వారా ఆటో నడపటం నేర్చుకుంది అంకిత.

లాజి బరోట్ కూడా భిన్న సామర్ధ్యం కలిగిన దివ్యాఅంగులు.

ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు తను ఆటో నడిపి డబ్బులు సంపాదించి తన తండ్రికి వైద్యం చేయిస్తూ,తన కుటుంబానికి అండగా నిలుస్తోంది.