ఒక అప్పుడు పోలీసులు అంటే ప్రజలకు కాస్త కోపం,కొంచెం భయం మాత్రమే ఉండేవి.

కానీ ఇప్పుడు అదే ప్రజలుకు పోలీసులు అంటే  గౌరవం పుట్టుకొస్తుంది.దానికి కారణం

కొందరూ పోలీసు లు ఆయా సమయాలును అనుసరించి వారి మానవత్వని ప్రదర్శించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం శ్రీకాకుళం జిల్లా లోని కాశిబుగ్గ SI శిరీషా.

తన పై అధికారి నుండి ఆదేశాలతో, ఒక గుర్తింపు లేని వ్యక్తి యొక్క శవం పడి ఉందన్న సమాచారం రావడంతో పరిశీలంచిదానికి వెళ్లారు SI శిరీషా.

ఆ ప్రదేశం పలాస లోని అడివి కొత్తూరు చాలా మారుమూల ప్రాంతం.అక్కడికి వాహనాలు వెళ్లే మార్గం లేదు,కాలి నడకన మాత్రమే సాధ్యం అవుతుంది.

ప్రదేశానికి చేరుకున్న తర్వాత అక్కడ పడి ఉన్న మృతదేహం,ఎవరో యాచాకుడిది గా గుర్తించారు.ఆ మృతదేహం పొలాల్లో పడి ఉంది.ఆ మృతదేహానికి అంత్య క్రియాలు జరిపించాలని శిరీషా నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన లలిత స్వచ్ఛంద సంస్థ తో మాట్లాడి వాహనాన్ని రప్పించారు.

దానికి ఆ మృతదేహన్నీ వాహనం లోకి చేర్చడానికి సహాయపడమని గ్రామస్తులను కోరగా ఎవరు సహకరించక పోగా తానే ముందు నిలబడి మృతదేహాని వాహనం వరకు మోసి,

తన దృష్టిలో శివుడైన శవమై న తన డ్యూటీ లో ఒకటైనని తన మానవత్వని చాటి ఆదర్శం గా నిలిచారు.


తన జీవితం లో తనకు ఎదురైన సంఘటన ల ప్రభావమై తనను ఇటువంటి మానవత్వ కార్యక్రమాల చేయడానికి ప్రేరణ అని శిరీషా చెబుతున్నారు.


సమాజంలో అమ్మాయిలు పట్ల ఉన్న వివక్ష కారణం గా,తన తండ్రి తనకు 13 ఏళ్లకే పెళ్లి చేశారు.పెళ్లి జరిగిన చదువుకోవాలన్న తపన ఉండటం తో కష్టపడి M.Pharmcy వరకు చదువుకుని, కానిస్టేబుల్ పరీక్ష రాసి అందులో ఎక్సైజ్‌ కానిస్టేబుల్ గా నియమించబడ్డారు.


ఎక్సైజ్‌ కానిస్టేబుల్ గా పని చేస్తున్న సమయం లో తన పై అధికారి తన ను కించపరిచిన సంఘటన తో బాధపడి తాను కానిస్టేబుల్ గా మిగిలిపోకూడదు అని నిర్ణయించుకుని ,SI పరీక్ష రాసి తన ప్రతిభ ను చాటుకుని,SI గా ఇప్పుడు తన వృత్తి ని చేస్తున్నారు.

ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన SI శిరీషా ను పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులు ఆమె పై ప్రశంసలు ను కురిపించారు.