ఉదయాన్నే లేచి స్నానం చేసి 

స్కూల్ యూనిఫామ్ వేసుకుని,

తన కోసం తన ఇంటి విధి చివర,

నిలబడి వేచి చూసేవాడ్ని…


తను స్కూల్ కి తొమ్మిది పావు నుండి పావుగంట తక్కువ పది ఆ సమయం లో వచ్చేది.

కానీ నేను ఎనిమిది గంటలకే విధి చివర నిలబడి ఎదురుచూస్తూ ఉండే వాడ్ని.


తనను చూడాలన్నది పక్కన పెడితే 

తనను చూసే ఆ క్షణం లో జరిగే యుద్దానికి సమాయత్తం అవ్వడానికి  చాలా సమయం పట్టేది.

అందుకె ముందుగానే అక్కడికి చేరిపోయేవాడ్ని.

యుద్దానికి వెళ్లే ముందు ఒక సీపాయి

జరగబోయే యుద్దానికి తనను తాను ఎలా సిద్ధం చేసుకొంటాడో అలా.

నాకు నేను జరగబోయే అద్భుతానికి సిద్ధం అయ్యేవాడ్ని.


తనను చూసే క్షణం లో నాతో నాకే 

ఒక మినీ యుద్ధమే జరిగేది.

ఆ యుద్ధం లో ఎప్పుడు నేను గెలవలేదు.

ఎప్పటికి అయిన గెలుచే

ఆ క్షణం కోసం ఎదురుచూస్తూ ఉండేవాడ్ని.


తన కోసం నేను చూసే ఎదురుచూపుల్లో

పరిగెత్తి పరిగెత్తి కాలం కూడా

 అలిసిపోయి నెమ్మేది గా నడిచేది.

బయట ప్రపంచం అంతా నడుస్తున్న,

నా ప్రపంచం మాత్రం కదిలేది కాదు.

తను రానంత వరకు డబ్భై,ఎనబై కొట్టుకునే నా గుండె 

ఒక్కసారిగా వంద దాటి కొట్టుకోవడమే తను వస్తుంది అని నాకు అందే సంకేతం.


దూరంగా ఉన్నంత వరకు అంతా బాగుండేది

కానీ నా దగ్గరికి చేరే సరికి

నా చుట్టు అలుముకున్న వాతావరణం ఒక్కసారిగా

నిశ్శబ్దం అయిపోయేది.

తన ఎడమ చేతికి పెట్టుకున్న 

వాచీ లోని తిరిగే ముల్లు చేసే శబ్దం,

తన కుడి చేతి గాజుల సవ్వడి,

అంతకు మించి వేగం పెంచుకుని కొట్టుకోకుంటున్న నా గుండె చప్పుడు మాత్రమే నాకు వినిపించేవి.


తన కోసం నేనె కాదు

వీచే గాలి,

కదిలే మేఘం,

నడిచే కాలం కూడా ఆగిపోయేవి.ఇదంత  జరిగేది రెండు గంటల్లో నైనా రోజంతా దాని ప్రభావం ఉండేది.

అదొక అందమైన అద్భుతం.

మరుసటి రోజున మరల ఎదురుచూపులు షరా మాములే.


అందుకేనేమో…


తరగని ఎదురుచూపులు,

ఎన్నటికీ చెరిగిపోని తీపి జ్ఞాపకాలు అంటారు...