విశ్వంతా నిండిన ప్రేమ,
పిడికిలి అంతా గుండె ల్లో నిండని ప్రేమ.
శూన్యమైన ప్రేమ,
సరిహద్దుల మనసులో నింపుకున్న ప్రేమ.
సముద్రమంతా ప్రేమ,
అలిసిపోయే ఆల ప్రేమ.
మాన్పు లేని గాయం,
మరుపురాని జ్ఞాపకం.
శాసించేది ప్రేమ,
శపించేది ప్రేమ.
అంతమే లేని ప్రేమ,
అంతమైన కధ ప్రేమ.
మాయలా అనిపించే ప్రేమ,
మాయం చేసేది ప్రేమ.
వింతలు చేసేది ప్రేమ,
విషాదం మిగిల్చేది ప్రేమ.
నడిపించేది ప్రేమ,
మధ్యలో వదిలేసేది ప్రేమ.
తరలివచ్చే వసంతం ప్రేమ,
మోడుమార్చు శిశిరం ప్రేమ.
ఆనందాన్ని ఇచ్చేది ప్రేమ,
ఆవేదనను మిగిల్చేది ప్రేమ.
మొదటిచూపు లో ప్రేమ,
చివరిచూపు వరకు ప్రేమ.
ఉసులు చెప్పే ప్రేమ,
ఉసురు తీసే ప్రేమ.
మనిషిగా మార్చేది ప్రేమ,
మృగం గా మార్చేది ప్రేమ.
కొన్ని స్నేహాల నుండి పుట్టిన ప్రేమ,
కొన్ని బంధాలకు శత్రువు లా మారే ప్రేమ….
చెప్పుకుంటూ పోతే
ఈ ప్రేమలే అనంతమే….

0 Comments