అల్లరి నరేష్ ఈ పేరు వింటే మనకి ఎక్కువుగా గుర్తువచ్చేవి హాస్య చిత్రాలు మాత్రమే.కానీ నరేష్ తన సినీ ప్రయాణంలో కొన్ని సినిమాలు నరేష్ లోని నటుడ్ని బయటకు తెచ్చాయి.
నేను,గమ్యం,శంభో శివ శంభో, మహర్షి చిత్రాలలో నరేష్ వినోదం అనే పరిధి ని దాటి నటుడి గా విజయాన్ని సాధించాడు.
అయితే నరేష్ చాలా వేగంగా తన చిత్రాలను పూర్తి చేసి విడుదల చేయగలడు.ఒక సంవత్సర కాలం లో నరేష్ చిత్రాలు రెండు, మూడు విడుదల అయ్యేవి.
కాని ఈ చాలా సంవత్సరాలు నుండి నరేష్ చిత్రాలు తగ్గుముఖం పట్టాయి.అందులో ను నరేష్ కి విజయం దక్కి చాలా కాలం అయింది.
విజయం కోసం నరేష్ ఎదురుచూపులకు నాంది ముగింపు పలికింది అనే చెప్పాలి.
నాంది నరేష్ కొత్త ప్రయాణానికి నాంది పలికింది.
విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన చిత్రం నాంది.విడుదల అయిన అన్ని చోట్లా విజయవంతంగా దూసుకుపోతుంది.
ఒక సామాన్య కుటుంబ యువకుడిగా,
సంబంధం లేని నేరం లో నిందించబడ్డ బాధితుడిగా
నరేష్ నటన అద్భుతం.కొన్ని సన్నివేశలలో నరేష్ పాత నరేష్ ను గాక ఒక కొత్త నరేష్ ను మనం చూడవచ్చు.
ఒక మంత్రి, పోలీస్ అధికారి చేసిన భూ కుంభకోణం వార్త ని ప్రజలు మరిచిపోయేలా చేయడానికి,ప్రజా హక్కుల పోరాట నాయకుడ్ని ని హత్య చేస్తారు.
ఆ హత్య నింద ను సంబంధం లేని యువకుడిపై వేస్తారు.
చేయని నేరానికి ఆ యువకుడు జైలు శిక్ష ను అనుభవిస్తూ ఉంటాడు.
చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న ఆ యువకుడికి ఒక మహిళ న్యాయవాది సాయం చేసి బయటకు తీసుకువస్తుంది.
మహిళ న్యాయవాది కి ఆ యువకుడికి సంబంధం ఏంటి ?
జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ యువకుడు ఏమి చేశాడు ?
అన్నది మిగిలిన కదాంశము.
దర్శకుడు విజయ్ చాలా సున్నితంగా చిత్రాన్ని నడిపించారు.
చిత్రం కనిపించే పాత్ర లు పరిధి తక్కువే అయిన చిత్రంలో వారిదే ముఖ్య భాగం.
దేవీప్రసాద్, ప్రవీణ్, ప్రియదర్శి పోషించిన పాత్రలు చిత్రాన్ని అదనపు బలంగా నిలబడ్డాయి.
మహిళ న్యాయవాది గా వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే సంపాదించుకున్నారు.
సంగీతం కూడా సన్నివేశాలను మరింత దగ్గర చేసింది.
ఇన్నాళ్ళు కు నరేష్ ఆకలి కి దొరికిన మంచి భోజనం నాంది అనే చెప్పాలి.
ఇక పై కూడా ఇలాంటి చిత్రాలతో పాటు తనకు బలమైన వినోదాత్మక చిత్రాలతో కూడా ఆలరించి విజయం సాధించాలని కోరుకుంటూ….


0 Comments