ఈ మధ్య కాలం లో వచ్చిన చిత్రం " కలర్ ఫోటో " అందరిని ఆకట్టుకున్న విషయం అందరికి తెలిసిందే.సుహాస్, చాందిని నటన గాని, సందీప్ రాజ్ దర్శకత్వం గాని, కాల భైరవ సంగీతం గాని అన్నీ కూడా సినిమాని నిలబెట్టాయి.కానీ సినిమా విడుదల కు ముందు సినిమా స్థాయి ని పెంచిన పాట " తరగతి గది దాటి….ఎగిరిన మనసు".చాలా మందికి కొన్నాళ్లు ఆ పాట వినకుండా రోజులు గడవలేదు.అంత మంది మనసు ను దోచిన పాట రాసిన కలం పేరు కిట్టు విస్సాప్రగడ .
అసలు పేరు రవికృష్ణ. ఊరు అమలాపురం.
చిన్నప్పటి నుండి సినిమా,
అమ్మమ్మ చెప్పిన కధలు,పాడిన పాటలు కిట్టు కు పాటల రచయిత అవ్వలన్న కోరిక కు నారు పోసాయి.తన ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసి తెలుగు చిత్రసీమలో కి అడుగుపెట్టాలనుకున్నాడు.
కానీ కుటుంబ ఆర్ధిక పరిస్థితులు కారణం ముందు రాలేకపోయాడు.
హైదరాబాద్ గూగుల్ లో ఉద్యోగం లో చేరారు.కానీ సినిమా పట్ల ఇష్టాన్ని వదులుకోలేకపోయారు.
తన సోదరికి ఉద్యోగం రావడం తో ఆర్థిక ఆసరా తోడు అవ్వడం తో తన ఉద్యోగాని వదులుకుని ఇంట్లో చెప్పి చిత్రసీమ లోకి అడుగుపెట్టారు.
ముందు పెద్ద అవకాశాలు ఏమి రాలేదు.
కొన్ని లఘు చిత్రాలకు మాటల రచయిత గా పని చేస్తూ,అవకాశాలు కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో కొందరి పరిచయలతో వచ్చిన అవకాశాలతో తన ప్రతిభ ను చాటుకుంటు,తెలుగు సినిమా పాటల రచయితగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు
కిట్టు విస్సాప్రగడ అలియాస్ రవికృష్ణ….
కిట్టు రాసిన కొన్ని పాటలు చూసేయండి...
1.కలర్ ఫోటో - తరగతి గది దాటి....
3.మిడిల్ క్లాస్ మెలోడీస్ - గుంటూరు...
4.ఫలక్ నామ్ దాస్ - అరరే మనసా...
5.రంగుల రాట్నం - ఎన్నెన్నో...
6.హుషారు - ఉండిపోరాదే...
7.మా వింత గాధ వినుమా- దూరంగా...


1 Comments
👌👌👌👌👌✍️
ReplyDelete