వైద్యం ఈరోజుల్లో అత్యంత ఖరీదైన విషయం.
అనారోగ్యం చేసి ఆసుపత్రిలో కాలు పెట్టినప్పటి నుంచి తిరిగి కాలు బయటపెట్టే సరికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఎవరికి అంతు పట్టదు.
పోనీ ప్రభుత్వ ఆసుపత్రికి వెల్దామ అంటే ,అక్కడ ఉండే వాతావరణం కొత్త రోగాలు పుట్టుకోవస్తాయి.
ఇక కార్పొరేట్ ఆసుపత్రికి వెల్లే ధైర్యం అందరూ చేయలేరు.
అనారోగ్యం చేస్తే డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించు కోలేని పేదల కోసం పది రూపాయలు కె వైద్యం అందిస్తున్నారు. డాక్టర్ నూర్ పర్విన్.
విజయ్ నటించిన అదిరింది సినిమా లో 5/- డాక్టర్ పాత్ర అందరికి తెలిసిందే. ఆ సినిమా లో డాక్టర్ 5 రూపాయల కై ఉచితంగా వైద్యం చేస్తాడు.
మరి నిజ జీవితంలో అలా ఉచితంగా వైద్యం చేసేవారూ ఉంటారా సమాజం లో
మనం అలాంటి వారిని చూడగలమ.
ఈ ప్రశ్న కు సమాధానమే డాక్టర్ పర్విన్.
కడప లో ని మసాపేట లో ఒక ఆసుపత్రి ఉంది.Noor Chartriable Trust ఆసుపత్రి. అక్కడ వైద్యం కేవలం పది రూపాయలుకే వైద్యం అందుతుంది. అందుకే అక్కడ చాలా నిరుపేద మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం అక్కడికి వస్తారు.
డాక్టర్ నూర్ పర్విన్, పది రూపాయల డాక్టర్. ఆసుపత్రి కి వైద్యం కోసం వచ్చే వారి కోసం అతి తక్కువ ఫీజు తో వైద్యం చేస్తున్నారు.
విజయవాడకు చెందిన పర్విన్ కుటుంబం వాళ్ళ తాతయ్య, తండ్రి ఇద్దరు సమాజ సేవ చేసేవారు.చిన్నతనం వాళ్ళు చేస్తున్న సేవలను చూసిన పర్విన్ తను కూడా సమాజానికి సేవ చేయాలని అనుకున్నారు.
కడప లో ఒక ప్రైవేట్ వైద్య కళాశాలలో MBBS పూర్తి చేసారు.తన విద్య పూర్తి అయిన తర్వాత 104 లో,ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేసారు.
అక్కడ పనిచేస్తున్న సమయం లొనే తన కు పది రూపాయలకే వైద్యం అందించాలన్న ఆలోచన రావడం తో వెంటనే కడప లో మాసాయిపేట లో ఒక ఇంటిని అద్దె కు తీసుకుని క్లినిక్ ను ప్రారంభించారు.ఇన్ పేషంట్ లకు 50 రూపాయిలికే బెడ్ సదుపాయం కల్పిస్తున్నారు.
వైద్యం తో పాటు పర్విన్ అనేక సేవ స్వంచంద సంస్థల ద్వారా అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.కరోన వంటి విపత్కర సమయం లో కూడా పర్విన్ తన క్లినిక్ నిర్వహిస్తూనే అనేక మంది అన్నార్తులకు ఆహారాన్ని అందించారు.
పెద్ద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ని నిర్మించి , మరెన్నో సదుపాయాలను పేదవారికి ఉచితంగా అందించాలన్నదే తన ఆశయం అని అంటారు డాక్టర్ పర్విన్.





0 Comments