భరతభూమి పై ఉద్భవించిన అతి ప్రాచీన కళల లో నాట్యం ఒకటి.
నాట్యాని జన్మతహ సిద్దయించే వరాన్ని ప్రసాదించిన భగవంతుడు, నాట్యాని చూసి అనుభవించే గొప్ప అనుభూతి ని పొందే వరాన్ని నేటి తరాలకు చెందిన మనకు ఇచ్చిఉంటే బాగుండెది అని నా తపన.
నిత్యం కాలంతో పరిగెడుతూ మనం మరిచిపోతున్న అనేక విషయాలు లో శాస్త్రీయ నృత్యం కూడా ఒకటి అని అనుకోవడం లో తప్పు లేదు.
నృత్యం అనేది ఒక ఆధ్యాత్మిక విషయం అని మన తరాలకు తెలుసోలేదో నాకు తెలిదుగాని,
నాట్యం అంటే
తాళాలకు అనుగుణంగా
చేతిలోకి ముద్రను తేవడం,
ముఖం లో రసాన్ని పండించటం,
శరీరంలో అభినయాని తీసుకురావటం, కాళ్ళను కదపటం కాదు అని,
తనువు మనువు కలిసి ఏకాగ్రత తో ఆత్మ శోధన చేసే పక్రియ అని,
ఆ పక్రియ లో కలిగే అనుభూతులు శరీరం భూమిపై ఉండగానే మోక్షాని ప్రసాదిస్తాయిని,
నాట్యకళ మహనీయులు చెప్పకనే చెప్పారు.
అలాంటి నృత్య ప్రదర్శన ను తిలకించలేకపోతున్నం మనం.
భారతదేశం లో అనేక శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి,కానీ వాటిలో బాగా ప్రసిద్ధి చెందిన కూచిపూడి, భరత నాట్యం, కథకళీ,మోహిని యాట్టం మన దక్షిణ భారతదేశానికి చెందినవి అని చెప్పటం మనకు దొరికిన వరం గా భావించాలి.
మన తెలుగువారింట పుట్టిన నాట్యకళ కూచిపూడి,కొన్ని శతాబ్దాలు క్రితం కూచిపూడి అనే గ్రామంలో సిద్దేంద్ర యోగి ,ఈ నాట్యకళకు ఊపిరి పోశారు.
అప్పటినుండి తరతరాలుగా మన తెలుగు వారితో ప్రయాణం కొనసాగిస్తోంది కూచిపూడి నాట్యకళ.
భగవంతుడు ని ఆరాధించడాని కి గుడికి వెళ్ళితే, “ నృత్యం దర్శనం యామి” అని అర్చకులు పలికితే చెంపలు వాయించుకుని,
ఇంటి దగ్గర ఎవరైనా నాట్యం నేర్చుకుంటే ఆడంగిరేకులా విన్యాసం అని హేళన చేసే వాళ్ళు వున్నారు మన సమాజంలో.
పంచమవేదంగా భావించే నాట్యకళ అంతరించకూడదు అనేమో ఆ నటరాజ కొన్ని తరతరాలుగా కొంతమంది మహానుభావులనును నాట్యకళ ను, విలువ తెలియని అభాగ్యులుకు తెలియచెప్పామని మన దగ్గరకు పంపిస్తున్నాడు.
వెంపటి చిన్నసత్యం,
వేదాంతం లక్ష్మీనారాయణ,
తాడేపల్లి పెరయ్య,
శోభానాయుడు లాంటి ఎంతో మంది తమ చివరి శ్వాస వరకు కూచిపూడి నాట్యం కోసం బతికి,పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఆ నటరాజ జఠాలు లోకి చేరిపోయారు.
వారిని ఆదర్శంగా తీసుకుని కొంతమంది నేటి తరం నాట్యకళాకారులు వారి ఆదర్శాల ను ముందుకు తీసుకు వెళుతున్నారు. వారిలో కొంతమంది….

యామిని రెడ్డి: ప్రముఖ నాట్యకళాకారులు అయిన రాధరెడ్డి,రాజారెడ్డిలకు 1982 లో సెప్టెంబర్ 1న జన్మించారు. పుట్టినప్పటి నుంచే నాట్యం మీద ఇష్టం పెంచుకున్న యామిని రెడ్డి , MBA ను పూర్తి చేసి, పూర్తిగా నాట్యానికికి అంకితం అయ్యి దేశ విదేశాల లో కూచిపూడి నాట్య ప్రదర్శన లు ఇచ్చారు.
“ నాట్య తరంగిణి “ పేరు మీద అకాడమీ ని స్థాపించి,నాట్యాని నేర్పిస్తున్నారు.అనేక పురస్కారాలు పొందరూ.
నిశృంఖల డాన్స్ అకాడమీ స్థాపించి నాట్యాని నేర్పిస్తున్నారు.నిశృంఖల డాన్స్ అకాడమీ స్థాపించి నాట్యాని నేర్పిస్తున్నారు.
లలితా సింధురి: తూర్పుగోదావరి రాజమండ్రిలో జన్మించారు సింధురి,చిన్నప్పటి నుండి ఉన్న ఆసక్తి తో తల్లిదండ్రులా ప్రాత్సాహం తో పదకొండవ ఏటా నుండి ప్రదర్శన లు ఇవ్వటం ప్రారంభించారు.ఇంజినీరింగ్ పూర్తి చేసి ,నాట్యం పై ఇష్టం తో సుమారు ఏడు వందలు పైగా నాట్య ప్రదర్శన లు ఇచ్చి బాలాశ్రీ అవార్డును పొందారు.
ప్రీతి:హైదరాబాద్ లో జన్మించిన ప్రీతి,ఇంజినీరింగ్ పూర్తి చేసి నాట్యాని అభ్యసించారు.ఈమె ప్రముఖ నర్తకి శోభానాయుడు గారి శిష్యురాలు.దేశ విదేశాల లో నాట్య ప్రదర్శన లు యిచ్చి తన్మయి నాట్య అకాడమీ ని స్థాపించి నాట్యాని నేర్పిస్తున్నారు.
పావని: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కు చెందిన ప్రియకు నాల్గోవ తరగతిలో ఉండగా జరిగిన ప్రమాదంలో తన కాలును కోల్పోవాల్సి వచ్చింది. జైపూర్ పాదమును అమర్చారు వైద్యులు. ఆ బాధలో నుండి.పుట్టిన ఆత్మ విశ్వాసం మే తన లో నాట్య కారిణి ని బయటకు తీసింది.సుధాచంద్రన్ ను ఆదర్శంగా తీసుకుని నాట్యాని నేర్చుకుని ప్రదర్శన లు ఇస్తుంది పావని.
హాలిమ్ ఖాన్: నాట్యాని కి మతం అడ్డుకాదని నిరూపించారు హాలిమ్ ఖాన్.కూచిపూడి నాట్యంలో ప్రసిద్ధి చెందిన భామ కలాపం “ ప్రదర్షించటంలో ప్రావీణ్యం పొందిన వాడు హాలిమ్ ఖాన్.స్త్రీ వేషం వేసి నృత్య ప్రదర్శన లు ఇస్తున్నాడు హాలిమ్ ఖాన్.800 పై చిలుకు ప్రదర్శన లు యిచ్చి ఔరా అనిపించాడు హాలిమ్ ఖాన్.
ఇలా ఎంతో మంది తమలో రేగిన తపనను చిరుదీపం గా వెలుగుతున్న కూచిపూడి నాట్య కళ వైభవాన్ని ఉజ్వల దీపము గా వెలుగొందు దిశ గా నడిపిస్తున్న
ఎందరో మహానుభావులు కు ఇవే మా నృత్యంజలి……
ఎందరో మహానుభావులు కు ఇవే మా నృత్యంజలి……
0 Comments