ప్రతి ఒక్కరికి తనకంటూ ఒక ప్రయాణం ఉంటుంది.

ప్రయాణానికి ఒక గమ్య స్థానం ఉంటుంది.

ఆ ప్రయణంలో గమ్యస్థాన్ని కొంత మంది మాత్రమే చేరుకుంటారు.అలా గమ్యస్థానాన్ని చేరుకున్న వారి ప్రయాణం లో ఎన్నో కష్టాలు,ఎన్నో సవాల్ ను వారు ఎదుర్కొని దాటుకుని వస్తారు.అలా తమ గమ్యస్థానాన్ని చేరుకుంటారు.

అలాంటి వారిలో ఒకరు సోనాలి విష్ణు.భారత దేశపు కబడ్డీ క్రీడాకారిణి.

సోనాలి దేశస్థాయి క్రీడాకారిణి ని గా చేరుకోవడానికి చేసిన తన ప్రయాణంలో ఆమె కు ఎదురైన అనేక ఒడిదుడుకులు ను ఆమె అధిగమించింది.

1995 మే 27 ముంబై,లోయర్ పార్ లో జన్మించారు.

సోనాలి తండ్రి ఒక సెక్యూరిటీ గార్డ్,తల్లి వికలాంగురాలు.తల్లి తిను పదార్థాలు అమ్ముతూ కుటుంబాన్ని నడిపిస్తున్నారు.

సోనాలికి చిన్నతనం లో క్రికెట్ ఆట అంటే ఎక్కువుగా ఇష్టపడేది.క్రికెట్ లో తాను ఏమిటో నిరూపించాలి అనుకుంది.

కానీ తన కుటుంబ ఆర్ధిక స్థోమత తనకు తెలుసు,క్రికెట్ కు అవసరమైన వస్తువులను తల్లిదండ్రులు కొనిఇవ్వలేరు అని క్రికెట్ పై తన ఇష్టాన్ని వదులుకుంది.

ఒక ఇంగ్లీష్ రచయిత చెప్పినట్టు,

“ Everything happens for a reason “ 

ఇది సోనాలి విషయంలో నిజమైంది.

క్రికెట్ ను వదిలిన సోనాలికి కబడ్డీ ఆట తోడు అయింది.కబడ్డీ ఆటలో మొదట్లో కొంచెం కష్టం అనిపించిన ,క్రమక్రమంగా కబడ్డీ ఆట పై తన ఇష్టాన్ని పెంచుకుంది.

కానీ కబడ్డీ ఆట ఆడేందుకు తన కాలికి అవసరమైన షూ కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న సోనాలి,దానిని ఒక సవాల్ గా తీసుకుని షూ లేకుండానే తన సాధన ను కొనసాగించేది.

మగవాళ్ళుతో సమానం గా మెడలో అధిక బరువు వేసుకుని పరుగులు తీస్తూ తన వ్యాయామాన్ని సాగించేది.


సోనాలి లోని ఆసక్తిని చూసిన శివశక్తి మహిళ కబడ్డీ సంఘం కోచ్ అయిన రాజేష్ పడవే ఆమెకు శిక్షణ ఇచ్చారు.

సోనాలికి ఆయనే షూ , కబడ్డీ అవసరమైన సామగ్రిని కొనిఇచ్చారు.

కబడ్డీ లో మెళుకువ లు నేర్చుకుంటూ, శిక్షణ తీసుకుంటూ,కొన్నేళ్ళుకే వెస్టర్న్ రైల్వేస్ జట్టులో చేరి ,

2018 లో జరిగిన The Federation Cup Tournament లో సోనాలి తన ఆటను దేశానికి చూపించింది.


తనకు వచ్చిన అవకాశాన్ని పదునుగా వాడుకుని హిమాచల్ ప్రదేశ్ పై తన జట్టు గెలుపొందడం లో ప్రముఖ పాత్ర వహించింది.

సోనాలి ఆటను చూసి భారత కబడ్డీ సంఘం ఆమెను జాతీయ కబడ్డీ శిబిరానికి ఎంపిక చేసింది.

2018 లో జకర్త లో జరిగిన 18th Asian Games కు కబడ్డీ ఆడే అవకాశం దక్కించుకున్నారు.భారత జట్టు వెండి పతకం సాధించింది.


2019 లో ఖాట్మాండు లో జరిగిన South Asia Games లో భారత జట్టు బంగారు పతకం సాధించింది.

రెండు టౌర్నమెంట్ లో సోనాలి ప్రదర్శన చూసిన  మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు అత్యున్నత క్రీడా పురస్కారం అయిన శివ్ ఛత్రపతి ను ఇచ్చి గౌరవించింది.



సోనాలి విష్ణు

ఇక పై మరెన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటూ…..