స్థాయి శిఖరం

ఖ్యాతి అఖండం

ప్రేమ సముద్రం

జాలి గగనం

ఆధ్యాత్మికం అపారం ఇవన్నీ

 ప్రపంచ స్థాయి లో సూపర్ స్టార్ గా ఎదిగిన,ఒదిగి ఉండే రజినీకాంత్ లో కనిపించే వ్యక్తిత్వం.

సాధారణ బస్ కండక్టర్ నుండి ప్రపంచ స్థాయి లో గుర్తింపు పొందిన ఆయన పయనం ఎందరోకో ఆదర్శం.

గాలికి ఎగిరే తల వెంట్రుకలో స్టైల్,

కనుపాపలు కదిలితే స్టైల్,

పలికే డైలాగ్ స్టైల్,

చేతితో సెల్యూట్ చేయడం లో స్టైల్,

కాలు కదిపితే స్టైల్

ఇవన్నీ రజినికాంత్ కనిపించడమే చూసే అభిమానులు కు పెద్ద పండుగ.

రజిని సంపాదించిన అభిమానదళం అంత ఇంత కాదు.

ఆయన అభిమానులు 

ఆయన కటౌట్ లకు పాలభిషేకాలతో ఆగిపోరు,

పులదండలతో ఆగిపోరు,

విజిల్స్ తో ఆగిపోరు,

 హారతులతో ఆగిపోరు,

చొక్కాలు చింపుకోవడం తో ఆగిపోరు,

ఒక్క మాటలో చెప్పాలంటేఅంతకు మించి”.

తెర మీద ఉండి ఇంత అభిమాన ప్రపంచాని సంపాదించుకున్న రజిని

తెర వెనుక , బాహ్య ప్రపంచం లో ఒక సాధారణ సాధువు వలె జీవించటం అతని గొప్పతనం అనే చెప్పాలి.

ఎంత సంపాదించిన రజిని తన వెంట ఉంచుకునేవి ఒక లుంగి,ఒక చొక్కా మాత్రమే.

రచయిత్రి గాయత్రి శ్రీ కాంత్ రాసిన “ The Name is Rajanikanth” పుస్తకం లో వివరించిన ఒక సంఘటన అతని ఆధ్యాత్మిక చింతన ఎంత ఎక్కువో తెలుపుతుంది.

బెంగుళూరుకు లోని ఒక దేవాలయనికి ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. అతని ఒంటిమీద నలిగిన చొక్కా,లుంగి మాత్రమే ఉన్నాయి.ఆయని చూసిన ఒక మహిళ,అతని ఆపి చేతిలో పది రూపాయలు పెట్టింది.అతను ఏమి మాట్లాడకుండా పది రూపాయలు తీసుకున్నాడు. ఆయన దర్శనానికి వెళ్లి అతని జేబు లోని వంద రూపాయలు తీసి హుండీ లో వేసి,బయటకు వచ్చి కారు ఎక్కి కూర్చున్నాడు. ఇందంతా గమనించిన పది రూపాయలు ఇచ్చిన ఆమె పరుగుపరుగున వచ్చి తను ఇచ్చిన పది రూపాయలు వెనక్కి ఇవ్వమని అడిగారు.దానికి ఆవ్యక్తి ఒప్పోకోలేదు.

వ్యకి ఎవరో కాదు సూపర్ స్టార్ రజినీ.

మీరు ఇచ్చిన పది రూపాయలే నా స్థాయి అని దేవుడు మీ ద్వారా నా చెప్పాడు అని చెప్పి రజిని అక్కడ నుండి వెళ్లిపోయారు.

ఎంత ఎదిగిన ఒదిగి ఉండటమే ఆయన నైజం.

త్వరలో రాజకీయ ప్రవేశం చేస్తున్నారు రజిని.అందులోనూ ఆయన విజయం సాధించాలని కోరుకుంటూ..

పుట్టిన రోజు శుభాకాంక్షలు….