ముంబయి,28 నవంబర్,2008:

26 న సముద్ర మార్గంలో అక్రమంగా దేశంలో కి ప్రవేశించిన కొంతమంది ఉగ్రవాదులు, వాణిజ్య రాజధాని అయిన ముంబాయి లో పలు చోట్ల కాల్పులతో మారణహోమాని సృష్టించారు.ఇది గడిచిన రెండు రోజులు తర్వాత అంటే 28 న

చివరిగా ఉగ్రవాదులు తాజ్ ప్యాలెస్ లో అక్కడ ఉన్న భారతీయులు ల మధ్య దాక్కుని వున్నారు.

అదే రోజు తెల్లవారుజామున,

3 విమానాలు,

100 కమెండోలు,

600 గదులు ఉన్న

ప్యాలెస్ లో ఉన్న సిబ్బందిని, గదుల్లో ఉన్న వారందరిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు ను మొదలుపెట్టింది NSG.

కొంతమంది కమెండో లు ప్రాణాలకు తెగించి చాలా మంది సిబ్బందిని,అక్కడ ఉన్న వాళ్ళ అందరిని బయటకు తీసుకువచ్చేశారు.ఇంకా ఎవరైన ఉన్నారా అని ప్రతి గదికి ఫోన్ చేస్తున్న NSG టీం కికానీ 6వ ఫ్లోర్ లో ఉన్న మార్టిస్ గదిలో ఒక డేటా ఎంట్రీ ఉద్యోగి అక్కడ ఉన్నట్టు సమాచారం తెలిసింది. ఆ ఉద్యోగిని బయటకు తీసుకురావాలని NSG నిర్ణయం తీసుకుంది.ఒక టీం కు ఆ భాధ్యతను అప్పగించింది NSG.

ఆ టీం కు లీడర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ 

మేజర్ తో పాటు  పది మంది కమెండోలు కలిసి ప్యాలెస్ లో కి ప్రవేశించి మెట్లు మార్గం ద్వారా పైకి వెళుతూ ఉండగా వారి పై దాడి చేశారు ఉగ్రవాదులు ,ఈ క్రమంలో ఒక కమెండో ను కాపాడబోయిన మేజర్ కు వెనుక ఒక బులెట్ దూసుకెల్లింది.

ఇది జరిగిన ఐదు నిమిషాలు తర్వాత మేజర్ తన వాకిటాకీ ద్వారా తన టీంకు ఒక సందేశాన్ని పంపారు 

“ ఎవరు పైకి రావద్దు నేను చూసుకుంటా “( “ Don’t come up, I will Handle this) అవే ఉన్నికృష్ణన్ చివరి మాటలు.

ఆ తర్వాత మేజర్ వాకిటాకీ నుంచి ఎటువంటి సంకేతం రాకపోవడంతో మేజర్ మిస్సింగ్ అని కమెండో లు బయట ఉన్న అధికారులు కు సందేశాన్ని పంపారు.ఇక ఏ మేజర్ ను,కమెండోను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేమని NSG లోపలికి ప్రవేశించి ఉగ్రవాదుల ను హతమార్చారు.

ఇది మేజర్ ఉన్నికృష్ణన్ వీరమరణం పొందేముందు జరిగిన సంఘటన.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్:

15 మార్చ్ 1977 న కేరళకు చెందిన కుటుంబ లో ఉన్నికృష్ణన్, ధనలక్ష్మి దంపతులకు జన్మించారు.

తండ్రి ఇస్రో లో ఉద్యోగి.

ఉద్యోగ రిచా బెంగుళూరుకు వచ్చి అక్కడే స్థిర పడ్డారు.ఉన్నికృష్ణన్ తన విద్యాభ్యాసం Frank Anthony Junior School. లో జరిగింది.ISI లో 1995 లో BA డిగ్రీ ని పూర్తి చేసి NDA లో జాయిన్ అయ్యారు.

సినిమాలు అన్న ,సంగీతం అన్న ఇష్టం. 

కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయంలో 

పాకిస్తాన్ జవాన్ లు  భారత జవాన్ రూపం లో భారత్ లోకి ప్రవేశించగా ,దాని నిరోధించడానికి చేసిన ఆపరేషన్ విజయ్ లో పాల్గొన్న ఉన్నికృష్ణన్ చురుకుదనం కు మెచ్చిNSG కు పంపించింది భారత ప్రభుత్వం.

అలా NSG లోకి ప్రవేశించిన ఉన్నికృష్ణన్ 26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందారు.


ఉన్నికృష్ణన్ సేవలకు గాను భారత ప్రభుత్వం

 అత్యంత పురస్కారం అయిన అశోక్ చక్ర ను బహుకరించింది.

మన ప్రాణాల కోసం వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు,

మన కుటుంబం కోసం వాళ్ళు కుటుంబాలకు దూరం గా ఉంటున్నారు..

ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోగలం, 

జై జవాన్ అని నినాదించటం,

అమర హే అని స్మరించుకోవటం తప్ప…

అమరులైన ఎంతో మంది అమరవీరులకు నివాళి….