హర హర మహాదేవ…శంభో శంకర….
ఓం నమః శివాయ….
శివ నామ స్మరణం…సకల పాపహరణం….
ఒక మారేడు ఆకు…
కొన్ని నాగమల్లి పువ్వులు, పాలు
కొంచెం విభూది తో అభిషేకం చేస్తే ఉబ్బితబ్బి కోరిన వరాలు ఇచ్చే మహాదేవుడు ఆ ఈశ్వరుడు ఒక్కడే.
శివునికి ప్రీతిపాత్రమైన, పవిత్రమైన కార్తీక మాసం లో పంచారామాలు ను దర్శిస్తే జన్మజన్మ ల పుణ్యం ప్రాపిస్తుందని హిందువుల నమ్మకం.
ఒక్కసారి ఆ ప్రసిద్ధ పంచారామాలు గురించి తెలుసుకుందాం….
పంచారామాలు గురించి మహాకవి శ్రీనాధుడు రచించిన భీష్మపురాణం లో ఉంది.
తారకాసురుడు అనే రాక్షసుడు మహాదేవుడు గురించి ఘోర తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడు.
తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు వరం కోరుకోమనగా ఆత్మలింగంని వరంగా కోరుకున్నాడు.శివుడు ఆత్మ లింగాన్ని ప్రసాధించాడు.తారకాసురుడు ఆత్మ లింగాన్ని మింగి తన గొంతులో దాచుకుని,దేవతల పై దాడులు చేయటం ప్రారంభించాడు. తారకాసురుడు కి భయపడిన దేవతలు కైలాసానికి వచ్చి మొరపెట్టగా కుమారస్వామి తారకాసురుడు పై దాడి చేసి ,తారకాసురుడి కంఠాని ఛేదించగా, తారకాసురుడు దాచుకున్న ఆత్మలింగం ముక్కలై భూమి పై పలు ప్రదేశాలలో పడగ అవే పంచారామాలు గా వెలిశాయి. అవే పంచారామాలు
1.ద్రాక్షరామం. 2.కుమారరామం. 3.క్షిరరామం 4.సోమరామం 5.అమరరామం.
ద్రాక్షరామం:
ఆంద్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉంది.
పంచారామలలో ఒకటిగా,అష్టాదశ పీఠాల లో ఒకటిగా ప్రసిద్ధి. ఇక్కడ శివుడుకి భీమేశ్వరుని గా పేరు.
ద్రాక్షరామానికి ఉన్న మరో పేరు దక్షిణ కాశీ.దక్షప్రజాపతి ఇక్కడే యజ్ఞం చేసిన కారణం ఆ పేరు వచ్చిందని స్థలపురాణం చెపుతుంది.తూర్పు చాళుక్య వంశీయుడైన భిముడు ఆలయాన్ని నిర్మించాడని శాశనాలు చెబుతున్నాయి.
ఆలయంలో ఉన్న సప్తనదిలో స్నానమాచరించి,భీమేశ్వరుని దర్శించుకుంటారు.
ఇక్కడ.భీమేశ్వరుని తో పాటు మణిక్యాంబ దేవి కొలువై వున్నారు.
కుమారరామం:
ఆంద్ర ప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ కు సమీపంలోని సామర్లకోటలో ఉంది.
ఇక్కడ శివుడిని కుమారరామం బీమేశ్వరునిగా పిలుస్తారు.బాలాత్రిపుర సుందరి అమ్మవారు కూడా కొలువై ఉన్నరు.
కుమారస్వామే స్వయంగా ఈ లింగాన్ని ప్రతిష్ట చేశారని స్థల పురాణం చెబుతుంది.
అందువల్ల ఈ ప్రదేశానికి కుమారరామం అని పేరు వచ్చింది అని చెబుతారు.
ఈ ఆలయం లో చైత్ర వైశాఖ మాసాలలో సూర్య కిరణాలు ఉదయం స్వామి వారి పాదాలను, సాయంత్రం అమ్మవారి పాదాలను తాకుతాయి.
భక్తులు భీమగుండం పుష్కరిణి లో స్నానమాచరించి,దైవ దర్శనం చేసుకుంటారు.
ఇక్కడ లింగం 14 అడుగులు ఉంటుంది.
క్షిరరామం:
ఆంద్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో ఉంది.
ఇక్కడి రాముడు ప్రతిష్టించిన కారణంగా రామలింగేశ్వరుని పిలుస్తారు.కొప్పు లింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు.
పార్వతి దేవి కొలువై ఉంటారు.
కౌశికముని కుమారుడు అయిన ఉపమాన్యుడు శివుడుని నిత్య అభిషేకానికి క్షిరాన్ని ప్రసాదించమని కోరగా ,క్షిర పుష్కరిణి ఆ పరమ శివుడు సృషించాడని స్థలపురాణం చెబుతుంది.దాని ఈ క్షేత్రానికి క్షిరారామం అని పేరు వచ్చిందని చెబుతారు.ఇక్కడి శివలింగం పాలరాతి వలె ఉంటుంది.అందుకే ఈ శివలింగాన్ని దర్శించుకంటే పాలవలె మనుషులు కూడా శుద్ధి అవుతారని భక్తుల నమ్మకం.క్షిరారామం ఆలయ గోపురం ఎత్తు 120 అడుగులు.
సోమరామం:
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్ద గునీపూడి గ్రామంలో ఉంది.ఇక్కడ సోమనాధుడు అనే పేరుతో పిలుస్తారు.ఉమాదేవి సమేతుడై కొలువై ఉంటాడు ఆ పరమశివుడు.
బ్రహ్మండ పురాణం,భీమఖండంలో ఈ క్షేత్రం గురించి వివరాలు ఉన్నాయి.చంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిషించాడని చెబుతున్నాయి.అందుకనే ఈ ఆలయం లోని శివలింగం అమావాస్య రోజున గోధుమ వర్ణం లోను,పౌర్ణమి రోజున శ్వేతా వర్ణం లోను కన్పిస్తుంది.భక్తులు సోమ గుండం పుష్కరిణిలో స్నామాచరించి దర్శనం చేసుకుంటారు.
అమరరామం:
గుంటూరు జిల్లాలో అమరావతి లో ఉంది .పవిత్ర కృష్ణ నది ఒడ్డున ఉంది.
ఇక్కడ అమరేశ్వరుడు గా ప్రసిద్ది. చాముండీ సమితుడై నెలకొని వున్నాడు.
దుర్వాస మహర్షి చే శపించబడ్డ ఇంద్రుడు శాప విమోచన కోసం ఈ క్షేత్రం లో శివలింగాన్ని ప్రతిషించాడని స్థలపురాణం చెబుతుంది.

0 Comments