ఒక కవి తన రచనలు ద్వారా

విప్లవాన్ని సృష్టించగలడు,

మార్పును తీసుకురాగలడు,

ప్రేమను పంచగలడు,

ధైర్యాన్ని నింపగలడు,

కన్నీరు పెట్టించగలడు

కానీ అలాగే హాస్యాన్ని పుట్టించగలడని నవ్వులును పూయించగలడని

నిరూపించాడనికి కొన్ని హాస్య కవుల పాత్రలను సృష్టించారు అలనాటి సినీ రచయితలు.

పాత్రలు ద్వారా కవి చేసే రచనలను వ్యంగపరుస్తూ,విమర్శ మార్గం లో

పాత్రలు ద్వారా కవిత్వాలు పలికించారు కొంత మంది దర్శక రచయితలు.

కవి రాసే కవిత్వాలును ప్రజలు ఎలా విమర్శిస్తారో,వాటి అర్ధాలను ఎలా తారు మారు చేస్తారో పాత్రల ద్వారా పలికించారు.

కొన్ని పాత్రలు అయితే రచయిత గా చేసే ఘోరాలను హాస్యలు గా మలిచారు.

హాస్యబ్రహ్మ జంధ్యాల గారూ రచనలో ఎక్కువుగా తరహా హాస్యాన్ని చూస్తాం మనం.ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆనందభైరవి చిత్రం లోని అవధాని , పుత్తడి బొమ్మలో మేక,చంటబ్బాయి లో వాగ్దేవి పాత్రలచే జంధ్యాల గారు పూయించిన హాస్యం నాటికి నవ్వులు పూయించకమానలేదు.

అలాగే ప్రేమించుకుందాం రా సినిమాలో అభ్యుదయ కవి పాత్ర, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం చిత్రం లో నాగమణి పాత్రలు కవులు గా వాళ్ళు పండిచిన హాస్యం ఇప్పటికి గుర్తుకు వస్తే నవ్వడం మరిచిపోము మనం.

ఒక్కసారి పాత్రలు పలికించిన కవిత్వాలు చూద్దాం

పుత్తడి బొమ్మ- మేక: మేల్కొపే కవి


ఆనంద భైరవి: అవధాని

అవధాని పాత్రలో సుత్తి వీరభద్రం పలికించే ప్రాసలు అబ్బో

చదవడం కన్న చూస్తేనే ఎక్కువ నువ్వుతారు కాబట్టి


చంటిబ్బాయి: వాగ్దేవి

వాగ్దేవి పాత్రలో శ్రీలక్ష్మి గారు రాసిన కవిత..

ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది, ఎర్రగా ఉంటే బాగుండదు కనుక

రక్తం రంగు ఎర్రగానే ఎందుకుంటుంది, నీలంగా ఉంటే బాగుండదు కనుక

మల్లె తెల్లగానే ఎందుకుంటుంది,నల్లగా ఉంటే బాగుండదు కనుక


ఎదురింటి మొగుడు పక్కంటి పెళ్ళాం:  

ఆంధ్రుల అభిమాన వాణి,నవతర నవల వాణినాగమణి పాత్రలో శ్రీలక్ష్మి గారు చేసే రచనలు

ఆకాశం లో రైలు మబ్బులు,కారు మబ్బులు గుద్దుకుంటున్నాయి,

వాటి వెనుక నుంచి చంద్రుడు తొంగి చూస్తున్నాడు,

ఎడారి లో పడవలో ప్రయాణిస్తున్న కుమార్ రాజాకి కడుపులో కుక్కలు.పరిగెడుతున్నా యి

మిగిలినది కింద వీడియో లో చూడండి


ప్రేమించుకుందాం రా:

ఆభ్యుదయ కవి పాత్రలో  బాబు మోహన్ చేసే సాహిత్యం

ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు ఇస్తారు నార్త్ లో, ప్రేమ కోసం ప్రాణం ఇస్తాం సౌత్ లో

ప్రేమంటే సూర్యబింబం,తాకితే కాలుతుంది,

ప్రేమంటే నాటుబాంబు,కాలితే పెళుతుంది,

పాపం.కదా ప్రేమికులను విడదీయటం