హైదరాబాద్,LB నగర్ లో ఒక చెట్టు ఉంది.
చెట్టు కింద నల్లబల్ల మీద ఇలా రాసి ఉంటుంది.
" పని కోసం ప్రయత్నించు,
పస్తులు ఉండే పరిస్థితి ఉంటే,
ఇక్కడికి వచ్చి సరకులు పట్టుకెళ్ళు."
ఆ చెట్టు కింద 24/7 ఎలాంటి సహాయం కావాలన్న అక్కడ దొరుకుతుంది.
అదే
ATM - Any Time Meals...
40 మందికి అయిన ఆకలి తీర్చాలి అని మొదలైన ఆశయం,
250 రోజుల రాత్రి,పగలు అని మరచి కొనసాగించిన ప్రయాణంలో
25000 కుటుంబాల వరకు ఆకలిని తీర్చిన ATM.
ATM – Any Time Miles…
ఏప్రియల్ నెల….
కరోన కారణం గా విధించిన లాక్ డౌన్ సమయంలో ఉపాది లేక పస్తులు ఉన్న అనేక మంది మధ్య తరగతి కుటుంబాలకు,వలస కూలీ కుటుంబాల పాలిట అక్షయపాత్ర అయింది ATM.
ATM ద్వారా అనేక కుటుంబాలు తమ ఆకలిని తీర్చుకున్నాయి.
అనేక మంది ఉద్యోగాలు కోల్పోయిన వారు అంటే ప్రైవేట్ టీచర్ లు,కాంట్రాక్ట్ ఉద్యోగుల లు ఇలా ఎంతో మంది ATM ద్వారా సాయం పొందారు.
అక్టోబర్ నెల…
హైదరాబాద్ ను ముంచెత్తిన వరదల సమయంలో కూడా ATM అనేక నిరాశ్రయులకు ఆకలి దప్పిక లను తీర్చింది.
విపత్తుకర సమయంలో నే కాక సాధారణ సమయంలో కూడా మీకు మా సాయం ఎల్లప్పుడూ అందిస్తాం అంటుంది ATM.
ఒంట్లో శక్తి ఉంది పని చేసుకుంటాం అంటే ఉపాధి ని చూపిస్తుంది,
ఉపాధి లేదు ఆకలి తీర్చమంటే కావలిసిన సాయం చేస్తుంది,
చదువుకోవాలి అనుకుంటే పుస్తకాలు అందిస్తుంది….. ATM.
ఇలా అనేక అవసరాలు తీరుస్తున్న ATM వెనుక ఉన్నది ఎవరు…
దోసపాటి రాము…..
ఏప్రియల్ 13,2020 న LB నగర్ లో దోసపాటి రాము, ATM ను మొదలుపెట్టారు.
ATM మొదలుపెట్టినప్పటి నుండి రోజుకు సగటున 100 కుటుంబాలకు తమ సహాయాన్ని అందించారు రాము.
HR మేనేజర్ గా పనిచేస్తూ తనకు వస్తున్నా దానిలో సాయం చేస్తుంటే ఆ తృప్తి యే వేరు,అందుకే మా సాయం రాత్రి పగలు తోనే ఆగకూడదు అని అనుకుంటున్నాం అంటున్నారు రాము.
సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని చాలా మంది సాయం కోసం మా దగ్గరకు వస్తున్నారు,అలాంటి వాళ్ళను నిరాశ తో వెనక్కి పంపించకూడదు అనేది మా సంకల్పం.
ఒకప్పుడు ATM ద్వారా సాయం పొందిన వారు ,ఇప్పుడు ATM కు వాళ్ళ వంతు సాయం అందిస్తున్నారు.
లబ్ధి పొందిన వాళ్లే కాక ATM గురించి తెలిసిన వాళ్ళు సాయం అందిస్తున్నారు.అందుకే నిరంతరాయంగా మా ATM సాగుతుంది అంటున్నారు రాము.





0 Comments